చార్జీల మోతపై విపక్షాల ఆగ్రహం
బస్ భవన్‌ను ముట్టడించిన వామపక్షాలు
హెదరాబాద్, సెప్టెంబర్ 24 (జనంసాక్షి): ఆర్టీసీ బస్సు చార్జీల పెంపుపై విపక్షాలు భగ్గుమన్నాయి. పెంచిన చార్జీలను తగ్గించా లని రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలతో ¬రెత్తించాయి. చార్జీల పెంపు నిర్ణయాన్ని ఉపసంహరించక పోతే ప్రభుత్వానికి మూడి నట్లేనని హెచ్చరించాయి. సోమవారం హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్‌రోడ్డులోని బస్ భవన్ ఎదుట వామపక్షాలు, బీజేపీ, విద్యార్థి సంఘాలు వేర్వేరుగా ఆందోళనలు చేపట్టా యి. నిరసనకారులను పోలీసులు అరెస్టు చేసి, అక్కడి నుంచి తరలించారు. బస్సు చార్జీల పెంపును నిరసిస్తూ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ నేతృత్వంలో కార్యకర్తలు పెద్ద సంఖ్యలో బస్‌భవన్ ఎదుట ఆందోళనకు దిగారు. పెంచిన చార్జీలు వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. బస్‌భవన్‌లోకి చొచ్చుకెళ్లేందుకు యత్నించగా, పోలీసులు అడ్డుకొన్నారు. అనంతరం నారాయణ సహా నేతలు, కార్యకర్తలను అరెస్టు చేసి, అక్కడి నుంచి పోలీసుస్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీకి పోయే కాలం దగ్గర పడిందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పెంపు
బస్సు చార్జీల పెంపును నిరసిస్తూ బీజేపీ నేతలు బస్‌భవన్‌ను ముట్టడించేందుకు యత్నించారు. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, సీనియర్ నేత బండారు దత్తాత్రేయ సహా పలువురు నాయకులు, కార్యకర్తలు ఆర్టీసీ క్రాస్‌రోడ్ నుంచి ర్యాలీ బస్‌భవన్‌కు ముట్టడికి బయల్దేరారు. కిషన్‌రెడ్డి, దత్తాత్రేయ పలువురు ఎడ్లబండిపైకెక్కి నిరసన తెలిపారు. వారిని పోలీసులు అడ్డుకోవడంతో ఇరువర్గాలకు వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో ఒక్కసారిగా ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. పోలీసులు కిషన్‌రెడ్డి, దత్తాత్రేయ సహా కార్యకర్తలందరినీ అరెస్టు చేసి, అక్కడి నుంచి తరలించారు. ఈసందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడుతూ..
ఇప్పటికే వివిధ చార్జీలు పెంచి ప్రజలపై పెను భారం మోపిన ప్రభుత్వం.. బస్‌చార్జీల పెంచి మరింత భారం మోపిందని విమర్శించారు. విద్యుత్‌ను సక్రమంగా పంపిణీ చేయాలేని సర్కారు.. విద్యుత్ చార్జీలు పెంచిందని, సర్‌చార్జీలతో బాదుతోందని దుయ్యబట్టారు. బస్‌చార్జీల పెంపుతో సామాన్యులపై పెనుభారం మోపారని మండిపడ్డారు. డీజిల్ ధర పెంపు వల్ల చార్జీలు పెంచాల్సి వచ్చిందంటున్న మంత్రి బొత్స సత్యనారాయణ.. డీజిల్‌పై అమ్మకం పన్నును రద్దు చేయించాలని డిమాండ్ చేశారు. బస్‌చార్జీల పెంపునకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా మూడ్రోజుల పాటు నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు ప్రకటించారు. బస్‌భవన్‌ను ముట్టడించేందుకు విద్యార్థి సంఘాలు కూడా యత్నించాయి. పెంచిన చార్జీలను ఉపసంహరించాలని డిమాండ్ చేస్తూ.. ఎస్‌ఎఫ్‌ఐ, డీవైఎఫ్‌ఐ విద్యార్థి సంఘాల నేతలు బస్‌భవన్‌లోకి చొచ్చుకెళ్లేందుకు యత్నించారు. పెంచిన చార్జీలను తగ్గించాలని లోనికి వెళ్లేందుకు యత్నించగా, పోలీసులు వారిని అరెస్టు చేశారు.
ఆర్టీసీ చార్జీల పెంపుపై మెదక్ జిల్లా వ్యాప్తంగా నిరసనలు మిన్నంటాయి. సిద్ధిపేట డిపో ఎదుట ఎమ్మెల్యే హరీశ్‌రావు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. పెంచిన చార్జీలు వెంటనే తగ్గించాలని హరీశ్‌రావు డిమాండ్ చేశారు. లేకుంటే, ఆందోళనలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. అటు వరంగల్‌లోనూ టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు చార్జీల పెంపుపై వినూత్న రీతిలో నిరసన తెలిపారు. బస్సును తాళ్లతో లాగి నిరసన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేలు రాజయ్య, భిక్షపతి, తదితరులు పాల్గొన్నారు. చార్జీల పెంపును నిరసిస్తూ.. విజయవాడలో సీపీఐ, సీపీఎం ఆధ్వర్యంలో ఆందోళనలు చేపట్టారు. నెహ్రూ బస్టాప్ ఎదురుగా ధర్నాకు దిగారు. ప్రభుత్వం సంపన్న వర్గాలకు కొమ్ముకాస్తూ పేదలను అడ్డంగా దోచుకుంటుందని మండిపడ్డారు. ప్రభుత్వం ఇప్పటికైనా చార్జీల పెంపు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని, లేదంటే భారీ ఉద్యమం లేవదీస్తామని వామపక్ష నేతలు హెచ్చరించారు. పోలీసులు నిరసనకారులను అరెస్టు చేసి, స్టేషన్‌కు తరలించారు.
చార్జీల పెంపుపై బాపిరాజు అసహనం
బస్సు చార్జీల పెంపుపై విపక్షాల నుంచే కాక స్వపక్షం నుంచి కూడా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చార్జీల పెంపుపై తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) చైర్మన్ కనుమూరి బాపిరాజు అసహనం వ్యక్తం చేశారు. తిరుపతి-తిరుమల మధ్య బస్సు చార్జీ రూ.10 పెంచడం కఠిన నిర్ణయమని వ్యాఖ్యానించారు. కనుమ దారుల పేరుతో 18 కిలోవిూటర్ల దూరానికి రూ.10 పెంచడం తగదన్నారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లనున్నట్లు చెప్పారు. పాలకమండలి సభ్యులందరూ ఏకగ్రీవంగా తీర్మానించి, తమ నిర్ణయాన్ని ముఖ్యమంత్రితో చర్చిస్తామని తెలిపారు. తిరుమలకు కూడా సాధారణ పెంపు వర్తించేలా చర్యలు తీసుకోవాలని సీఎంను కోరతామని వెల్లడించారు. చార్జీల పెంపు నుంచి భక్తులకు మినహాయింపునివ్వాలని ఆయన కోరారు.