తప్పిపోయిన మూడేళ్ల బాలుడిని క్షేమంగా వాళ్ళ తల్లిదండ్రులు అప్పగించిన ఆర్టీసీ ఉద్యోగస్తులు
తప్పిపోయిన మూడేళ్ల బాలుడిని క్షేమంగా వాళ్ళ తల్లిదండ్రులు అప్పగించిన ఆర్టీసీ ఉద్యోగస్తులు కొండమల్లేపల్లి అక్టోబర్ 8 జనంసాక్షి : దేవరకొండ ఆర్టీసీ బస్ స్టేషన్ లో మిస్సింగ్ అయిన మూడేళ్ల బాలుడిని ఆర్టీసీ ఉద్యోగులు వారి కుటుంబ సభ్యులకు క్షేమంగా అప్పగించిన ఘటన శనివారం జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. పెద్దవూర మండలం గర్నెకుంట గ్రామానికి చెందిన గిరిప్రసాద్ కుటుంబ సభ్యులు ఏడుగురు హైదరాబాద్ వెళ్లేందుకు కొండమల్లేపల్లి బస్ స్టేషన్ లో సీట్లు దొరకవని దేవరకొండకు వచ్చి హైదరాబాద్ కు బస్సు ఎక్కారు. దసరా సెలవుల అనంతరం ప్రయాణీకుల రద్దీ ఎక్కువగా ఉండడంతో హడావుడిలో బస్సు ఎక్కారు. కానీ, మూడేళ్ల దినేష్ అనే బాబును మర్చిపోయారు. ఎవరో ఒకరి దగ్గర ఉండి ఉంటాడని అనుకున్నారు. ఇబ్రహీంపట్నం వెళ్లిన తర్వాత బాబు కనిపించకపోవడంతో కంగారు పడి దేవరకొండ డిపోకు సమాచారం ఇవ్వడంతో RTC ఉద్యోగులు బాబును 3గంటలపాటు బుజ్జగించి అక్కున చేర్చుకున్నారు. బాబు కుటుంబ సభ్యులు వచ్చిన తర్వాత అధికారులు వారికి అప్పగించారు. ఈసందర్భంగా ఆర్టీసీ అధికారులకు, ఉద్యోగులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈకార్యక్రమంలో ట్రాఫిక్ సూపర్వైజర్ మహిపాల్ నాయక్ ,నారాయణ,,vj రెడ్డి ,రమేష్ మరియు ఉద్యోగులు పాల్గొన్నారు.