తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం

2

– 17 మంది మృతి

చెన్నై,జూన్‌ 3(జనంసాక్షి):తమిళనాడులో శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కృష్ణగిరి జిల్లా నేల్‌మలై సవిూపంలో ఓ ప్రయివేటు బస్సు-లారీ ఢీకొన్న ఘటనలో 17మంది దుర్మరణం

చెందారు. మరో 15మంది గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం జరిగినప్పుడు బస్సులో 33మంది ప్రయాణికులు ఉన్నారు. వీరంతా బెరిగాయ్‌ నుంచి కృష్ణగిరి వస్తుండగా ఈ దుర్ఘటన జరిగింది.కాగా కర్ణాటక నుంచి వేరుశెనగ లోడుతో వస్తున్న లారీ  అయిదో నెంబర్‌ జాతీయ రహదారిపై అదుపు తప్పింది. లారీ ముందుగా బస్సును ఆ తర్వాత ఓ కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 17మంది అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల్లో 12ఏళ్ల చిన్నారి సహా ఆరుగురు మహిళలు కూడా ఉన్నారు.  కాగా మృతుల వివరాలతో పాటు ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.