తమిళనాడు అసెంబ్లీలో తూత్తుకూడి ప్రకంపనలు

చెన్నై,మే29(జ‌నం సాక్షి): తమిళనాడు అసెంబ్లీ సమావేశాలు వాడీవేడిగా ప్రారంభమయ్యాయి. 13 మందిని బలి తీసుకున్న పోలీసుల కాల్పులకు నిరసనగా ప్రతిపక్ష నేత, డీఎంకే సారథి ఎంకే స్టాలిన్‌ సహా ఆ పార్టీ ఎమ్మెల్యేలంతా నల్ల చొక్కలాఉల  ధరించి అసెంబ్లీకి వచ్చారు. తూత్తుకూడి ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ సీఎం పళనిస్వామి రాజీనామా చేయాలని స్టాలిన్‌  డిమాండ్‌ చేశారు. ప్రజలు కూడా ఇదే కోరుకుంటున్నందున వెంటనే పదవి నుంచి వైదొలగాలని అన్నారు. ప్రభుత్వ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసిన ప్రతిపక్షాలు అన్నాడీఎంకే తీరును వ్యతిరేకిస్తూ సభ నుంచి వాకౌంట్‌  చేశారు.