తలమడుగు ద్విచక్రవాహనం బోల్తాపడి వ్యక్తి మృతి
తలమడుగు: ద్విచక్రవాహనం అదుపుతప్పి బోల్తాపడి వ్యక్తి దుర్మరణం పాలైన ఘటన మంగళవారం రాత్రి తలమడుగు మండలంలో చోటుచేసుకుంది. మండలంలోని బరంపుర్ గ్రామానికి చెందిన మారం భీమన్న (35) వ్యవసాయ పనుల నిమిత్తం పల్లి(కె) గ్రామానికి వెళ్లి తిరిగి వస్తుండగా ప్రమాదవశత్తు అతని వాహనం బోల్తపడింది. దీంతో వాహనంపై నుంచి పడిన అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.