తల్లఢిల్లీ
చిన్నారిపై అఘాయిత్యానికి నిరసనగా హోరెత్తిన ఆందోళనలు
కోలుకుంటున బాలిక
నిందితుడి అరెస్టు
న్యూఢిల్లీ, ఏప్రిల్ 20 (జనంసాక్షి) : చిన్నారిపై కీచకపర్వానికి వ్యతిరే కంగా ఢిల్లీ ఏకమైంది. శనివారం దేశ రాజధాని ఢిల్లీ ఆందోళనలతో ¬రెత్తింది. ఈ దుర్ఘటనను నిరసిస్తూ ఢిల్లీ వాసులు రెండో రోజూ ఆందోళనలు చేపట్టడంతో హస్తిన దద్దరిల్లింది. ఘటనపై రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తీవ్ర దిÛగ్బ్రాంతి వ్యక్తం చేశారు. బాలిక త్వరగా కోలు కోవాలని ఆకాంక్షించారు. చిన్నారులు, మహిళలపై జరగుతున్న అత్యాచారాలపై ప్రణబ్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. నేరపూరిత చర్యలకు కారణం ఏమిటో గుర్తించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. బాధితులకు న్యాయం జరిగేలా నిందితులకు కఠినశిక్షలు విధించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం కూడా ఈ ఘటనను తీవ్రంగా పరిగణించింది. ఘనటకు పాల్పడిన నిందితుడిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపింది. అఘాయిత్యానికి పాల్పడిన నిందితుడికి కఠినంగా శిక్ష పడేలా చూస్తామని ¬ం మంత్రి సుశీల్‌కుమార్ షిండే తెలిపారు. మజఫరాబాద్‌లో నిందితుడిని అరెస్టు చేసి పోలీసులు విచారిస్తున్నారని చెప్పారు. బాధిత చిన్నారి కుటుంబ సభ్యులను ఆరోగ్య శాఖ మంత్రి గులాం నబీ ఆజాద్ పరామర్శించారు. అత్యాచారానికి పాల్పడిన నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. కోర్టు నిందితుడికి 3 రోజుల రిమాండ్ విధించింది. కాగా చిన్నారి పరిస్థితి ప్రస్తుతం నిలకడగానే ఉందని ఎయిమ్స్ వైద్యులు తెలిపారు. ఇన్ఫెక్షన్ సోకకుండా సెలైన్ల ద్వారా యాటీబయోటిక్స్ ఇస్తున్నట్లు వెల్లడించారు. చిన్నారి వైద్యానికి స్పందిస్తుందని, ఆరోగ్య పరిస్థితిపై ఎప్పటికప్పుడు పాప తల్లిదండ్రులకు సమాచారం ఇస్తున్నట్లు డాక్టర్ గుప్తా తెలిపారు. ఢిల్లీలో ఐదేళ్ల చిన్నారిపై అత్యాచారానికి పాల్పడిన నిందితుడు మనోజ్‌ను పోలీసులు శనివారం తెల్లవారుజామున బీహార్‌లో అదుపులోకి తీసుకున్నారు. రాజధాని పాట్నాకు 50 కిలోమీటర్ల దూరంలో చిక్నౌత వద్ద నిందితుడ్ని అరెస్టు చేసి, స్థానిక సబ్ డివిజనల్ జ్యుడీషియల్ మేజిస్టేట్ర్ ఎదుట హాజరుపరచాగా.. మేజిస్టేట్ర్ శత్రఘ్నసింగ్ నిందితుడికి ఏప్రిల్ 23 వరకు రిమాండ్ విధించారు. నిందితుడిని ఢిల్లీ తరలించేందుకు కోర్టు పీటీ వారెంట్ జారీ చేయడంతో మనోజ్‌ను ఢిల్లీకి తరలించారు. అఘాయిత్యానికి పాల్పడినట్లు అతుడు అంగీకరించాడని పోలీసులు తెలిపారు.
చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడి పారిపోయిన మనోజ్‌ను పోలీసులు అతని సెల్‌ఫోన్ సిగ్నల్స్‌ను ట్రేస్ చేసి, ఎక్కడున్నాడో గుర్తించారు. స్థానికుల సాయంతో అతడిని అరెస్టు చేశారు. కూలీగా పని చేసే మనోజ్‌కు ఇటీవలే వివాహం కాగా, భార్య రెండ్రోజుల క్రితమే పుట్టింటికి వెళ్లింది. దీంతో అతడు తాను నివాసముంటున్న ఇంట్లోనే అద్దెకుంటున్న ఐదేళ్ల చిన్నారిని ఇంటికి పిలిచి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. రెండ్రోజులు ఆమెను గదిలో ఉంచి పలుమార్లు అత్యాచారం చేశారు. పాప కనిపించకపోవడంతో తల్లిదండ్రులకు ఈ నెల 15న పోలీసులను ఆశ్రయించారు. ఈ కేసుపై పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. అపార్ట్‌మెంట్‌లోని ఓ గది నుంచి పాప అరుపులు విన్న తల్లిదండ్రులు, స్థానికులు గదిలో బంధించిన పాపను రక్షించారు. అప్పటికే ఆమె పరిస్థితి విషమించడంతో ఎయిమ్స్ ఆస్పత్రికి తరలించారు. శరీరమంతా ఇన్ఫెక్షన్ సోకడంతో ఆమె మృత్యువుకు దగ్గరైంది. వైద్యులు నిరంతరం పర్యవేక్షిస్తూ ఆమెను కాపాడేందుకు యత్నిస్తున్నారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు శనివారం ప్రకటించారు. ఇదిలా ఉంటే, చిన్నారిపై అఘాయిత్యం జరగడంపై రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆవేదన వ్యక్తం చేశారు. ఐదేళ్ల పాపపై అత్యాచారానికి పాల్పడిన నిందితుడికి కఠిన శిక్ష పడేలా చూడాలని, బాధితురాలికి న్యాయం చేయాలని కోరారు. మరోవైపు, మహిళలపై వరుస అఘాయిత్యాలను నిరసిస్తూ ఢిల్లీలో ఆందోళనలు వెల్లువెత్తాయి. ఎయిమ్స్‌తో పాటు పోలీసు హెడ్‌క్వార్టర్స్‌ను ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలు, ఆందోళనకారులు ముట్టడించారు. బాధితురాలికి న్యాయం చేయడంతో పాటు కేసులో నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై వేటు వేయాలని డిమాండ్ చేశారు. ఢిల్లీ పోలీసు ప్రధాన కార్యాలయం ఎదుట బైఠాయించారు. పోలీసులు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ ఘటనపై పోలీసులు స్పందించిన తీరుపై మండిపడ్డారు. పలువురు ఆందోళనకారులు బారికేడ్లను దాటుకొని లోనికి చొచ్చుకెళ్లేందుకు యత్నించారు. ఢిల్లీ పోలీసు కమిషనర్ నీరజ్‌కుమార్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర మంత్రి గులాం నబీ ఆజాద్ శనివారం పాప తల్లిదండ్రులను పరామర్శించారు. చిన్నారికి పూర్తి వైద్య సాయం అందజేస్తామని హావిూ ఇచ్చారు. ఎయిమ్స్ ఆస్పత్రికి వచ్చిన ఆజాద్ పాప ఆరోగ్యంపై వైద్యులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. రేపిస్టులకు ఉరే సరైన శిక్ష అని బీజేపీ అభిప్రాయపడింది. చిన్నారి అత్యాచార ఘటనపై ఆ పార్టీ నేత సుష్మాస్వరాజ్ శనివారం స్పందించారు. ప్రభుత్వం కఠిన చట్టాలు చేయడంతోనే సరిపోదని, మానవత్వ విలువు పెంచే చర్యలు కూడా తీసుకోవాలని.. అప్పుడే మహిళలపై అత్యాచారాలు ఆగిపోతాయన్నారు.