తహశీల్దార్ కార్యాలయంను దిగ్బంధించిన విఆర్ఏలు

మల్దకల్ అక్టోబర్10 (జనంసాక్షి)
మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయాన్ని సోమవారం విఆర్ఏలు దిగ్బంధించారు.గత 78 రోజులుగా న్యాయ పరమైన డిమాండ్ల సాధనకు సమ్మె చేపట్టినా ప్రభుత్వం స్పందించక పోవడంతో కార్యాలయాన్ని దిగ్బంధం చేసి అధికారులు కార్యాలయానికి రాకుండా అడ్డుకున్నారు.దీనితో కార్యాలయం పనుల నిమిత్తం వచ్చిన ప్రజలు ప్రభుత్వ తీరుపై అసహనం వ్యక్తం చేశారు.78 రోజులుగా విఆర్ఏలు సమ్మెబాట పట్టినప్పటినుంచి రెవెన్యూ పనులు మందకొడిగా సాగుతున్నాయని కార్యాలయానికి వచ్చిన ప్రజలు ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. ఈకార్యక్రమంలో మండల వీఆర్ఏల సంఘం అధ్యక్షుడు పూర లక్ష్మన్న, ఉపాధ్యక్షుడు నర్సింలు, కార్యదర్శి వెంకటేష్ కమిటీ సభ్యులు హనుమంతు, రంగస్వామి,లక్ష్మణ్,నాగార్జున, ఆంజనేయులు,తిమ్మన్న, నామాల వినోద్ ,శంకరన్న దేవమ్మ, తిమ్మమ్మ,వినోద్, సోమేశ్వరమ్మ,లక్ష్మి, అశోక్,ఆర్ఏలు పాల్గొన్నారు.