తహసిల్దార్ కార్యాలయం ముందు వీ.ఆర్.ఏల ధర్నా.
కూసుమంచి జూన్ 30 (జనం సాక్షి): రాష్ట్ర వీ.ఆర్.ఏ.ల (jAC) సంఘం ఇచ్చిన పిలుపుమేరకు గురువారం రోజున కూసుమంచి తహసిల్దార్ కార్యాలయం ముందు కూసుమంచి వీఆర్ఏల సంఘం ధర్నా నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అయిన తర్వాత అన్ని శాఖలను ప్రక్షాళన చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకొని సాక్షాత్తు ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో వి. ఆర్ .ఏ లకు పే స్కేలు ప్రకటించారు ముఖ్యమంత్రి ప్రకటించిన పే స్కేలు తో సహా ఏ ఒక్క హామీ అమలు కాకపోవడంతో నేడు రాష్ట్ర వ్యాప్తంగా వీఆర్ఏల సంఘం డిమాండ్లతో కూడిన ప్లే కార్డులతో తాసిల్దార్ కార్యాలయాల ముందు ధర్నా నిర్వహించారు. దానిలో భాగంగానే కూసుమంచి తాసిల్దార్ కార్యాలయం ముందు మండల వీఆర్ఏల సంఘం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వీఆర్ఏల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పడిశాల శ్రీనివాస్ మాట్లాడుతూ వీఆర్ఏలకు పే స్కేల్ వెంటనే ప్రకటించాలని 55 సంవత్సరాలు నిండిన వీఆర్ఏ వారసులకు ఉద్యోగం కల్పించాలని, అర్హులైన వీఆర్ఏలకు ప్రమోషన్లు ఇచ్చి వారి యొక్క ఇతర డిమాండ్లను కూడా నెరవేర్చాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వీఆర్ఏల సంఘం జిల్లా కోశాధికారి మోదుగు వీరబాబు, మండల విఆర్ఏ ల సంఘం అధ్యక్షుడు దారా శ్రీనివాస్, మండల ప్రధాన కార్యదర్శి షేక్ అన్వర్ పాషా, వీఆర్ఏలు రమేష్, రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.
Attachments area