తహసీల్దార్ కార్యాలయం ను దిగ్బంధనము చేసిన వీఆర్ఏలు

పెద్ద వంగర అక్టోబర్ 10(జనం సాక్షి )
తెలంగాణ రాష్ట్రంలో వీఆర్ఏ జేఏసీల నిరవధిక సమ్మె జులై 25న ప్రారంభించి, అక్టోబర్ 10 సోమవారం నాటికి 78 రోజులు పూర్తయిందని వీఆర్ఏ లు తెలిపారు. అదేవిధంగా సీఎం కెసిఆర్ అసెంబ్లీలో ప్రకటించిన వీఆర్ఏల పే స్కేల్ పై జీ ఓ మరియు అర్హులైన వీఆర్ఏలకు ప్రమోషన్లు మరియు 55 సంవత్సరాలు పైబడిన విఆర్ఏల స్థానంలో వారి వారసులకు ఉద్యోగం ఇస్తానని మాట ఇచ్చారు. కానీ ఇప్పటివరకు వీఆర్ఏలకు ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా ప్రభుత్వం నెరవేర్చలేదు. ఈ హామీ ఇచ్చి రెండు సంవత్సరాలు గడుస్తున్నది కాబట్టి ఈ హామీలన్నీ అతి తొందరగా అమలు చేయాలని సోమవారం రోజు రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు 78వ రోజు నిరవధిక సమ్మెలో భాగముగా పెద్దవంగర తహసిల్దార్ కార్యాలయమును దిగ్బంధనము చేయడమైనది. మూడు నెలలుగా జీతాలు లేక ఇబ్బంది పడుతున్నామని, వీఆర్ఏల పైన ఇంత పక్షపాతిగా ఉండొద్దని అన్నారు.ఇట్టి కార్యక్రమంలో స్థానిక వీఆర్ఏలు తోట వేణు కుమార్, రవి, సతీష్, వెంకన్న, రాకేష్,జ్యోతి, వెంకటనారాయణ, సోమయ్య,అంజయ్య, దుర్గయ్య తదితరులు పాల్గొన్నారు.