తాండూరు నియోజకవర్గంలో రాబోయేది బిజెపి ప్రభుత్వం.
పట్టణ భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు సుదర్శన్ గౌడ్.
తాండూరు అక్టోబర్ 20(జనంసాక్షి)తాండూరు బీసీ సామాజిక వర్గానికి చెందిన ఇద్దరు బలమైన నేతలు మురళీ కృష్ణ గౌడ్, నరేష్ మహారాజులు పార్టీలో చేరడం పార్టీ కార్యకర్తలు యువతలో ఎంతో ఉత్సాహం నింపుతుందని అన్నారు. గత పదిహేళ్లుగా యువతలో మంచి ఫాలోయింగ్ మరియు యంగ్ లీడర్స్ సంస్థ ద్వారా ఎన్నో రాజకీయ మార్పులు తీసుకువచ్చిన యువ నాయకుడు మురళీకృష్ణ గౌడ్ పార్టీలో చేరడం బిజెపికి బలమని అన్నారు.ఈ ప్రాంతంలో మనసున్న మహారాజుగా పేరుపొందిన నరేష్ మహారాజ్ పార్టీలో చేరడం పార్టీకి బలం చేకూరుతుందని అన్నారు.. నూతనంగా పార్టీలోకి చేరిన నాయకులను పార్టీలోకి సాదరంగా స్వాగతం పలుకుతామని సుదర్శన్ గౌడ్ తెలిపారు.తాండూర్ నియోజకవర్గంలో బిజెపి మాత్రమే ప్రత్యామ్నాయ శక్తి అని యువతరం. గ్రామీణ పట్టణ కుల మతాల అతీతంగా ప్రతి ఒక్కరూ భారతీయ జనతా పార్టీ ని బల పరిచేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు. నూతనంగా చేరిన నాయకుల సమన్వయంతో పట్టణంలో పార్టీని తిరుగులేని శక్తిగా మారుస్తామని తెలిపారు.