తాగు, సాగు నీరందించడమే లక్ష్యం

ఖమ్మం, జనవరి 30 (): మహబూబాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గ పరిధిలోని ప్రజలందరికీ తాగు, సాగు నీరు కష్టాలు లేకుండా చూడటమే లక్ష్యమని కేంద్రమంత్రి బలరాంనాయక్‌ తెలిపారు. ఇల్లెందులో బస్‌ డిపో ఏర్పాటు, ప్యాసింజరు, రైలు రాకపోకలు సాగించడం, దుమ్ముగూడెం పైపులైను ద్వారా నీటిని ఇల్లెందుకు మళ్లించడం, పట్టణంలో పోస్టుగ్రాడ్యుయేట్‌, పాలిటెక్నిక్‌ కళాశాలల ఏర్పాటు, పట్టణ నడిబొడ్డున గల కూరగాయల మార్కెట్‌ను అభివృద్ధి చేయడం ప్రధాన లక్ష్యంగా నిధుల కోసం కృషి చేస్తున్నానని స్పష్టం చేశారు. ఇల్లెందు పట్టనాభివృద్ధికి రూ.45 కోట్లతో అభివృద్ధి పనుల నిమిత్తం ప్రతిపాదనలు ప్రభుత్వానికి అందజేశానని తెలిపారు. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి జైపాల్‌రెడ్డితో నిధుల మంజూరు గురించి చరిస్తానన్నారు. ఇల్లెందు-భద్రాచలం ప్రధాన రహదారికి రూ.6 కోట్లు మంజూరు చేయించానని తెలిపారు. ఇల్లెందు మండలంలోని చల్లసముద్రం చెరువు అభివృద్ధికి నిధులు మంజూరు చేయిస్తానన్నారు. ఇల్లెందు, పినపాక, భద్రాచలం వాసన సభ్యులకు నియోజకవర్గ అభివృద్ధి కోసం రూ.కోటి చొప్పున మంజూరు చేయించానన్నారు.