*తాడ్వాయి తండలో వైభవంగా సీత్లా పండుగ*

 పూజా కార్యక్రమంలో పాల్గొన్న వైస్ ఎంపీపీ కొలిశెట్టి బుచ్చిపాపయ్య

మునగాల, జులై 19(జనంసాక్షి): మండల పరిధిలోని తాడ్వాయి తండాలో మంగళవారం జరిగిన సీత్లా పండుగలో మండల పరిషత్ ఉపాధ్యక్షులు కొలిశెట్టి బుచ్చిపాపయ్య పాల్గొన్ని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అత్యంత వైభవంగా సీత్ల పండుగను గ్రామంలో ఏడుగురు అమ్మవార్లను సీత్ల మాత ఆధ్వర్యంలో కొలువు దీర్చి పంట పైరు బాగుండాలని, గోసంపద బాగుండాలని, తండాలో ఎలాంటి అంటు రోగాలు రాకుండా ఆషాఢ మాసంలో శుక్ల పక్షంలో బంజారాలు జరుపుకునే పండగ సీత్ల  పండుగ అని అన్నారు. తండాలో మహిళలు అందరూ లంబాడీ దుస్తులు ధరించి, అమ్మ వార్లకు నైవేద్యం వండి, బోనాలు ఎత్తుకుని బంజార నృత్యం చేస్తూ తండా వాసులు భక్తి శ్రద్ధలతో ఊరేగింపుగా బయలు దేరి, అమ్మ వార్లకు నైవేద్యం సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. అమ్మ వారు దగ్గర మేక పోతులను బలి ఇచ్చి తండాకు ఎలాంటి అరిష్టం జరుగకూడదని వేడుకుంటారని తెలిపారు. సీత్లా పండుగను భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని, అందరూ కలిసి మెలిసి ఉండాలని, తండా వాసులందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో, పాడిపంటలతో, గోసంపదతో, వర్షాలు బాగా కురిసి పంటలు బాగా పండి రైతన్నలు ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలని వేడుకుంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు భుక్యా సంతోష్, మాజీ సర్పంచ్ యం లక్యా నాయక్, శ్రీను, భిక్షం,  వీరన్న, కపిల్, బాలునాయక్ పలువురు మహిళలు తదితరులు పాల్గొన్నారు.