తాళం వేసిన అచ్చంపేట లేబర్ ఆఫీసు తలుపుకు వినతిపత్రం ఇచ్చిన సిఐటియు నాయకులు

అచ్చంపేట ఆర్సీ, 26 జూలై ,(జనం సాక్షి న్యూస్) : స్థానిక పట్టణ కేంద్రంలో అసంఘటిత రంగ కార్మికుల సమస్యలను పరిష్కరించాలంటూ అచ్చంపేట కార్మిక సంక్షేమ కార్యాలయానికి వెళ్లిన సిఐటియు నాయకులకు పని దినాలలో పని చేయాల్సిన కార్యాలయం తాళాలు పడి దర్శనమిచ్చింది . తాళం వేసిన తలుపుల వద్ద వినతి పత్రం తో సిఐటియు జిల్లా నాయకు లు ఎస్ మల్లేష్ మాట్లాడుతూ అసంఘటిత రంగంలో పనిచేస్తున్న కార్మికుల కు ప్రావిడెంట్ ఫండ్ ఈఎస్ఐ ప్రమాద బీమా కనీస వేతనాల ను అమలు చేయాలని స్థానిక వ్యవసాయ మార్కెట్లో పనిచేస్తున్న హమాలీలకు విశ్రాంతి గదులు మంచినీటి సౌకర్యాన్ని కల్పించాలని కోరారు. ఇదే క్రమంలో మార్కెట్ యాజమాన్లు స్థానిక మార్కెట్ హమాలీలను కాదని బీహార్ నుంచి వచ్చిన హమాలీలతో పని చేయించుకోవడం వలన ఇక్కడ ఉన్న హమాలీలకు తీవ్రంగా అన్యాయం జరుగుతుందన్నారు , కావున వెంటనే బీహార్ లేబర్ ను తొలగించి స్థానికులకు అవకాశం ఇవ్వాలన్నారు .మార్కెట్ చైర్మన్ స్థానిక హమాలీలతో సంప్రదించకుండా గుర్తింపు లేని 12 మంది హమాలీలను తీసుకువచ్చి స్థానిక కార్మికుల పుట్ట మీద కొట్టే విధంగా చేస్తున్నారని అన్నారు. ఆగస్టు మూడో తేదీన చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని అసంఘటిత రంగ కార్మికులకు పిలుపునిచ్చారు