తిరుపతి సహా పలుచోట్ల భారీగా కూరిసిన వర్షం
హైదరాబాద్: శుక్రవారం సాయంత్రం తిరుపతి , శ్రీకాకుళం, విశాఖపట్నాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం పడుతోంది. తిరుపతిలో ఉరుములతో కూడిన జల్లులు పడగా, శ్రీకాకుళం వజ్రపుకొత్తూరు మండలం పుండిలో కుండపోత వర్షం కురిసింది. వడగళ్లు పడ్డాయి. పలాస మండలం సున్నాడలో పిడుగుపాటుకు ఇద్దరు మృతి చెందారు. విశాఖలోనూ ఉరుములు, మెరుపులతో వర్షం కురుస్తున్నట్లు సమాచారం.