తీరం దాటిన ‘గులాబ్’` తెలంగాణలో భారీ వర్షాలు
` అప్రమత్తం చేసిన యంత్రాంగం
శ్రీకాకుళం,సెప్టెంబరు 26(జనంసాక్షి): గులాబ్ తుపాను తీరాన్ని తాకే ప్రక్రియ ప్రారంభమైందని భారత వాతావరణ శాఖ వెల్లడిరచింది. తీరాన్ని తాకే ప్రక్రియ మరో మూడు గంటల్లో పూర్తవుతుందని తెలిపింది. ప్రస్తుతం తీర ప్రాంతాల్లో 75 నుంచి 85 కిలోవిూటర్ల వేగంతో గాలులు వీస్తున్నట్లు పేర్కొంది. తుపాను తీరం దాటే వేళలో 95 కి.విూ.వేగంతో గాలులు వీచే అవకాశం ఉన్నట్లు తెలిపింది.గులాబ్ తుపాను ఫ్రభావంతో శ్రీకాకుళం జిల్లాలోని సముద్ర తీర ప్రాంతాల్లో తుపాను ప్రభావం మొదలైంది. తీరప్రాంతాల్లో బలమైన గాలులు వీస్తున్నాయి. తుపాన్ నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ శ్రీకేస్ లాఠక్ ఆదేశించారు. ఇప్పటికే వజ్రపుకొత్తూరు మండలం పరిధిలో 182 మందిని పునరావాస కేంద్రాలకు తరలించినట్లు చెప్పారు. 73 కుటుంబాలకు నిత్యావసర సరకులు పంపిణీ చేశామన్నారు. ఫిర్యాదులు, సాయం కోసం కలెక్టరేట్‌లోని కంట్రోల్ రూమ్ నంబర్ 08942`240557, ఎస్పీ కార్యాలయంలోని కంట్రోల్ రూమ్ నంబర్ 6309990933ను సంప్రదించాలని కలెక్టర్ సూచించారు.తుపాను ప్రభావంతో శ్రీకాకుళం జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. జిల్లాలోని నరసన్నపేటలో కురిసిన వర్షానికి రోడ్లు జలమయం అయ్యాయి. ప్రధాన వీధుల్లో మోకాళ్ల లోతు నీరు నిలిచిపోయి రాకపోకలకు అంతరాయం ఏర్పడిరది. సముద్ర తీర ప్రాంతాలైన రాజారాంపూరం, గుప్పెడుపేట, గొల్లవానిపేట గ్రామాల్లో తుపాన్ ప్రభావం మరింత ఎక్కువగా ఉంది. ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ తీర గ్రామాల్లో పర్యటించి ఎప్పటికప్పుడు పరిస్థితులపై ఆరా తీస్తున్నారు. గులాబ్ తుపాను.. శ్రీకాకుళం జిల్లా పలాస, టెక్కలి నియోజకవర్గాల మధ్య తీరం దాటే అవకాశాలు ఉన్నాయని మంత్రి సీదిరి అప్పలరాజు తెలిపారు. దేవునళ్తాడ, బావనపాడు, మూలపేట వద్ద తీరం దాటే అవకాశం ఉందన్నారు. వజ్రపుకొత్తూరు, సంతబొమ్మాళి మండలాల తీరప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి సూచించారు.విశాఖ జిల్లాలో తుపాను హెచ్చరికలపై రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ కమిషనర్ కన్నబాబు అధికారులను అప్రమత్తం చేశారు. ఇవాళ రాత్రి కళింగపట్నం ` గోపాలపట్నం మధ్య తుపాన్ తీరం దాటే అవకాశం ఉందన్నారు. విద్యుత్తు, జీవీఎంసీ, రెవెన్యూ, ఫైర్, పోలీస్, ఆర్ అండ్ బీ, మత్యశాఖ అధికారులు, సిబ్బంది అవసరమైన సహాయక సామగ్రితో సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. తీరప్రాంత మండలాల్లోని ప్రజలకు ఎప్పటికప్పుడు అవసరమైన సమాచారం అందించాలని.. ఈ విషయంలో గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది సేవలను వినియోగించుకోవాలని కోరారు. 22 మంది సిబ్బందితో కూడిన ఎన్డీఆర్‌ఎఫ్ బృందం గాజువాక పరిధిలో సిద్ధంగా ఉందన్నారు.విద్యుత్తు అంతరాయాలపై ఫిర్యాదుకు టోల్ ఫ్రీ నంబర్‌తుపాను ప్రభావంతో కలిగే విద్యుత్తు అంతరాయాలపై టోల్ ఫ్రీ నంబర్ 1912కి ఫిర్యాదు చేయాలని ఏపీఈపీడీసీఎల్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కె. సంతోషరావు సూచించారు. విద్యుత్తు పునరుద్ధరణ చర్యలు చేపట్టెందుకు సంస్థ డైరెక్టర్లు, ఆపరేషన్స్, ప్లానింగ్, కమర్షియల్, మెటీరియల్ పర్చేజ్ విభాగపు అధికారులతో సమావేశమయ్యారు. తుపాను ప్రభావానికి తెగిపడే విద్యుత్ వైర్లు, విద్యుత్ స్తంభాలు, నియంత్రికలను సరిచేసేందుకు యంత్రాంగాన్ని, పరికరాలను, సిబ్బందిని అందుబాటులో ఉంచాలన్నారు.ఎల్లుండి వరకు భారీ వర్షాలు: కలెక్టర్లను అప్రమత్తం చేసిన సీఎస్‌తెలంగాణలో భారీ వర్షాల నేపథ్యంలో జిల్లా కలెక్టర్లను సీఎస్ సోమేశ్ కుమార్ అప్రమత్తం చేశారు. సీఎం కేసీఆర్‌తో పాటు దిల్లీ పర్యటనలో ఉన్న ఆయన అక్కడి నుంచే జిల్లా కలెక్టర్లతో పాటు రోడ్లు భవనాల శాఖ ముఖ్యకార్యదర్శి సునీల్ శర్మ, విపత్తుల నిర్వహణశాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా, పంచాయితీ రాజ్, ఇంధనశాఖ కార్యదర్శి సందీప్ సుల్తానియాలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈరోజు రాత్రి నుంచి ఎల్లుండి వరకు రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ హెచ్చరికల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. రెండ్రోజుల పాటు రాష్ట్రంపై గులాబ్ తుపాను ప్రభావం ఉంటుందని తెలిపారు. అన్ని జిల్లాల కలెక్టరేట్లలో సహాయక చర్యల కోసం ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేయాలని సూచించారు. వాతావరణశాఖ ఉత్తర తెలంగాణ జిల్లాలకు రెడ్ అలర్ట్, దక్షిణ తెలంగాణ జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ ప్రకటించినట్టు తెలిపారు. జిల్లాల్లో పోలీసు, ఇతర శాఖలతో సమన్వయంతో పనిచేయాలని, లోతట్టు ప్రాంతాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తెగడానికి అవకాశం ఉన్న చెరువులపై ప్రత్యేక నిఘా ఉంచి, ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అవసరమైతే ఎన్‌డీఆర్‌ఎఫ్ సేవలు తీసుకోవాలన్నారు. ప్రస్తుతం వరంగల్, హైదరాబాద్, కొత్తగూడెంలో ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు అందుబాటులో ఉన్నాయన్నారు. ప్రతి మండలంలో ప్రత్యేక అధికారులను నియమించి ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లకుండా చూడాలని పేర్కొన్నారు‘గులాబ్’ ప్రభావం.. హై అలర్ట్ ప్రకటించిన జీహెచ్‌ఎంసీహైదరాబాద్: గులాబ్ తుపాన్ ప్రభావంతో వచ్చే రెండు రోజులపాటు హైదరాబాద్ నగరంలోనూ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించడంతో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) యంత్రాంగం అప్రమత్తమైంది. జీహెచ్‌ఎంసీ విపత్తుల నిర్వహణ విభాగం మూడు రోజులపాటు హై అలర్ట్ ప్రకటించింది. జోనల్ కమిషనర్లు, డిప్యూటీ కమిషనర్లు, హెచ్‌ఓడీలు అవసరమైన చర్యలు తీసుకోవాలని జీహెచ్‌ఎంసీ విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. లోతట్టు ప్రాంతాల పట్ల అప్రమత్తంగా ఉండాలని.. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని క్షేత్ర స్థాయిలో సిబ్బందిని సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. ఫోన్ కాల్స్‌కు తక్షణమే స్పందించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున పడవలు, పంపులు, ఇతర అవసరమైన పరికరాలు, యంత్రాలు అందుబాటులో ఉండేలా చూసుకోవాలని పేర్కొన్నారు.గత అనుభవాల దృష్ట్యా వరద పరిస్థితులు తలెత్తే అవకాశం ఉన్నందున అత్యవసర స్థితిని ముందుగానే అంచనా వేసుకోవాలని చెప్పారు. లోతట్టు ప్రాంతాలను తనిఖీ చేసి నీటి నిల్వలను ఎప్పటికప్పుడు తొలగించేందుకు ప్రత్యేక బృందాలను సిద్ధంగా ఉంచాలని వివరించారు. వీకాఫ్‌లు, సెలవులు వారంపాటు పరిమితంగా తీసుకోవాలని.. సిబ్బంది అందుబాటులో ఉండేలా అధికారులు ప్రణాళిక వేసుకోవాలన్నారు. ముంపు ప్రాంతాల నుంచి ప్రజలను తరలించాల్సి వచ్చినా అందుకు అనుగుణంగా పునరావాస కేంద్రాలను ముందే సిద్ధం చేసుకోవాలని, అక్కడ ప్రాథమిక సౌకర్యాలు ఉండేలా చూడాలన్నారు. రవాణా ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. వరదలు, లోతట్టు ప్రాంతాల గురించి ఆయా ప్రాంతాల ప్రజలను ముందస్తుగా హెచ్చరించేందుకు తగిన ఏర్పాట్లు చేసుకోవాలని వెల్లడిరచారు.