తుడుందెబ్బ ఆధ్వర్యంలో 25న చలో మహాదేవపూర్

 పోడు భూములకు పట్టాలు ఇవ్వాలి
తుడుందెబ్బజిల్లా
అధ్యక్షులు కుమార్ఆదివాసీ
మాహాదేవపూర్ ఆగస్టు 22 (జనంసాక్షి)
మాహాదేవపూర్ మండల కేంద్రంలో తుడుం దెబ్బ నాయకులు జిల్లా అధ్యక్షులు మాడే కుమార్  మాట్లాడుతూ .గత కొన్నేళ్లుగా ఆదివాసీలు చేసుకుంటున్న పొడుభూములకు  మట్టాలివ్వాలని ఈ నెల 25న మహాదేవపూర్ సబ్ డివిజన్ ఫారెస్ట్ డి.ఎఫ్.ఓ. కార్యాలయంముందు ధర్నా చేపడుతామని పేర్కొన్నారు ఈ కార్యక్రమాన్నీ తుడుందెబ్బ ఆధ్వర్యంలో ప్రజా సంఘాల మద్దతు కలుపుకొని మహాదేవపూర్ లో నిర్వహించడం జరుగుతుందని ఆదివాసీలు పొడుదారులందరూ అధిక సంఖ్యలో పాల్గొని ధర్నాను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.  ఈ కార్యక్రమంలో తుడుందెబ్బ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ మడే సత్యనారాయణ జిల్లా ఉపాధ్యక్షులు కొవ్వూరి కిష్టయ్య పెద్ది మధునయ్య ఆదివాసీ విద్యార్థి సంఘం జిల్లా నాయకులు మట్టి కిషోర్ తొర్రెమ్ రాజేందర్ తదితరులు పాల్గొన్నారు