తుత్తుకూడిపై ఇంత నిర్లక్ష్యమా?

ప్రధాని మోడీ స్పందించకపోవడం దారుణం
తీవ్రంగా విరుచుకుప్డడ్‌ స్టాలిన్‌
చెన్నై,మే28( జ‌నం సాక్షి ): పోలీసు కాల్పుల్లో 13 మందిని బలి తీసుకున్న తూత్తుకూడి ఘటనపై.. సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతున్నా ప్రధానమంత్రి మోడీ స్పందించకపోవడంపై డీఎంకే సారథి ఎంకే స్టాలిన్‌ తీవ్ర స్థాయిలో పదునైన విమర్శలు సంధించారు. తమిళనాడు భారత్‌లో ఉందా అన్న అనుమానం కలుగుతోందని  ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై స్టాలిన్‌ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఇంత ఘోరం జరిగింది… తమిళనాడు కూడా భారత్‌లో భాగమే కదా… మోదీ భారత ప్రధానమంత్రేనా…. లేక వేరే ఏదో దేశానికి చెందిన ప్రధానియా? నాకైతే అనుమానంగా ఉందన్నారు.  ఎందుకంటే భారత్‌లో అంతర్భాగమైన తమిళనాడులో… 13 మంది ప్రజలు ప్రాణాలు కోల్పోతే… 50 నుంచి 60 మంది తీవ్రంగా గాయపడి ఆస్పత్రుల్లో పడి ఉంటే.. ఇప్పటికీ ఇదే ఘటనలు పునరావృతం అవుతున్నా కూడా మోదీ స్పందించలేదని   స్టాలిన్‌ మండిపడ్డారు. ఇక ప్రధాని ఎప్పుడు స్పందిస్తారో అని మండిపడ్డారు. ప్రధాని మోదీ ఇక్కడికి వచ్చి సందర్శించి వెళ్లడం కనీస ధర్మం.. లేదా కేంద్రమంత్రిని అయినా పంపించి ఉండాల్సింది. అదీ కుదరకపోతే… కనీసం మృతుల కుటుంబాలకు సంతాపం సందేశమైనా పంపించాల్సింది. ఇవేవిూ చేయకపోవడం సిగ్గుచేటని దుయ్యబట్టారు. కాగా టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ ట్విటర్లో విసిరిన ఫిట్‌నెస్‌ ఛాలెంజ్‌కి మరుసటి రోజే స్పందించిన మోదీ… తూత్తుకూడి మారణకాండపై పెదవి విప్పకపోవడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రధాని మోదీతో పాటు తమిళనాడు ప్రభుత్వంపైనా స్టాలిన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత డీప్యూటీ సీఎం పన్నీర్‌సెల్వం అయినా తూత్తుకూడి రావాల్సింది. కానీ ఆయన ఇక్కడికి వచ్చిన పాపాన పోలేదు. సోమవారం ఆయన తూత్తుకూడి వస్తారని చెబుతున్నారు.. ఒక వేళ వచ్చినా అది కేవలం కంటితుడుపు కోసం మాత్రమే. ఎందుకంటే ఈ నెల 29 నుంచి అసెంబ్లీ సమావేశాలున్నాయి. అక్కడ ప్రభుత్వాన్ని ఎండగడతామని తెలిసే వారు ఇలాంటి కంటితుడుపు చర్యలు దిగుతారని వ్యాఖ్యానించారు. తుత్‌ఉకూడా ఘటనపై తక్షణ చర్యలు తీసుకోవాలన్నారు.