తెరాస అక్రమాలను ఎండగడతాం
ఆదిలాబాద్,మే30(జనం సాక్షి):2019లో దేశంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు డాక్టర్ నరేష్ జాదవ్ అన్నారు. కొందరు వ్యక్తిగత స్వార్థప్రయోజనాల కోసమే రాజకీయ జన్మనిచ్చిన పార్టీలను వీడి తెరాసలో చేరుతున్నారని విమర్శించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తప్పుడు సర్వేలతో ప్రజలను తప్పుదోవపట్టించేందుకు ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. తెలంగాణలో ప్రజాస్వామిక పాలనలేదని కుటుంబ పాలన సాగుతోందని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఉపాధిహావిూ, సమాచార హక్కుచట్టం వంటి చట్టాలు అమల్లోకి వచ్చాయన్నారు.
—–