తెలంగాణకు నష్టం జరగకపోతే

5

నదుల అనుసంధానానికి ఒకే

మంత్రి హరిశ్‌ రావు
హైదరాబాద్‌ జనవరి6(జనంసాక్షి): తెలంగాణకు నష్టం జరగకపోతే నదుల అనుసంధానానికి తమకు ఎలాంటి అభ్యంతరం లేదనీ  తెలంగాణ భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌ రావు స్పష్టం చేశారు. నదీ జలాల అనుసంధానంపై దిల్లీలో జరిగిన ప్రత్యేక కమిటీ సమావేశం ముగిసింది. రాష్గానికి ఉన్న సందేహాలను కమిటీ ముందు ఉంచామని హరీశ్‌రావు తెలిపారు. కాగా ఖమ్మం జిల్లా కొత్తగూడెంలో విమానాశ్రయం ఏర్పాటు చేయాలని కేంద్ర విమానయానశాఖ మంత్రి  అశోక్‌ గజపతిరాజును  తెలంగాణ మంత్రి హరీష్‌ రావు కోరారు. ఇక్కడ సింగరేణి ప్రధాన కార్యాలంతో పాటు, పర్యాటక అభివృద్దికి గల అవకాశాలు, భద్రాచలం దేవస్థానం ఉన్నందున విమానాశ్రయ ఆవశ్యకత ఉందన్నారు. మంగళవారం ఢిల్లీకి వచ్చిన హరీస్‌ రావు కేంద్రమంత్రులతో భేటీ అయ్యారు. అనంతరం ఆయన విూడియాతో మాట్లాడారు. తెలంగాణలో విమానాశ్రయాల అభివృద్ధికి చొరవ చూపాలని కోరినట్లు గా వివరించారు. ప్రధానంగా ఈ ప్రాంతం దూరంగా ఉండడం వల్ల అభివృద్దికి నోచుకోలేదన్నారు. ఖమ్మం జిల్లా కొత్తగూడెం వద్ద విమానాశ్రయం ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలని కేంద్ర మంత్రిని ప్రత్యేకంగా కలిసి వినతిపత్రం ఇచ్చారు. కొత్తగూడెంలో అనేక కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు,పరిశ్రమలు ఉన్నాయని, అక్కడ విమానాశ్రయం ఏర్పాటు చేస్తే ఉపయోగంగా ఉంటుందని ఆయన చెప్పారు.కొత్త గూడెం నుంచి హైదరాబాద్‌ కు సుమారు ఆరుగంటలకు పై గా ప్రయాణ సమయం పడుతున్న నేపధ్యంలో ఈ విమానాశ్రయం ప్రయోజనకరంగా ఉంటుందని చెబుతున్నారు. ఇదిలావుంటే కల్వకుర్తి, కొమరంభీం, ప్రాణహిత- చేవెళ్ల, ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతులిప్పించాలని జవదేవకర్‌ ను కోరినట్లుగా వెల్లడించారు. తెలంగాన ప్రాజెక్టులను వేగవంతం చేయాలని అన్నారు.