తెలంగాణకు రుతుపవనాలు

4

హైదరాబాద్‌,జూన్‌ 18(జనంసాక్షి): తెలుగు రాష్టాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ప్రకటించింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉత్తర కోస్తాంధ్ర, దక్షిణ ఒడిశా తీరాలకు సవిూపంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో రాగల రెండు, మూడు రోజుల్లో కోస్తాంధ్ర, రాయలసీమ, తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశముందని వెల్లడించారు. మూడు ప్రాంతాల్లోని కొన్ని చోట్ల భారీ వర్షాలు సైతం కురిసే అవకాశముందని స్పష్టం చేశారు. మొత్తానికి ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రుతుపవనాలు వచ్చేసాయి. రుతుపవనాలు ఆంధ్రప్రదేశ్‌ ను తాకాయి. ఎపిలో రుతుపవనాలు విస్తరించాయి. మరో 24 గంటల్లో తెలంగాణకు విస్తరించే అవకాశాలున్నాయి. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఇవాళ్టి నుంచి మూడురోజుల పాటు తెలంగాణలో భారీ వర్షాలు కురువనున్నాయి. వాతావరణ శాఖ కోస్తాంధ్రాకు భారీ వర్ష సూచన చేసింది.  మరో వైపు ఒకట్రెండు రోజుల్లో తెలంగాణలోకి నైరుతి రుతుపవనాలు వ్యాపించి… పూర్తిగా విస్తరిస్తాయని వివరించారు. ఇదిలావుంటే విజయవాడ, తదితర ప్రాంతాల్లో విస్తారంగా వర్షౄలు కురుస్తున్నాయి. మరోవైపు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న నైరుతి రుతుపవనాలు మరో రెండు రోజుల్లో రాష్టాన్న్రి  తాకనున్నాయి. కోస్తా ప్రాంతాన్ని ఆనుకుని బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడంతో రుతుపవనాలు కర్నూలు నుంచి కోస్తా జిల్లాల విూదుగా  కళింగపట్నం ఒడిశా బీహార్‌ వరకు విస్తరించినట్లు వాతావారణ శాఖ తెలిపింది. ఉపరితల ఆవర్థనం కారణంగా బంగాళాఖాతం నుంచి వచ్చే తేమ గాలులతో పవనాలు ఎల్లుండిలోగా తెలంగాణపై పూర్థిస్థాయిలో విస్తరించే అవకాశాలు ఉన్నాయి. వాస్తవానికి ఆరేబియా సముద్రం నుంచి ఆశించిన స్థాయిలో గాలులు రావడం లేదని,  దీంతో బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్థనం, కోస్తాలో కురిసే భారీవర్షాల కారణంగా తెలంగాణలోనూ వాతావరణం చల్లబడి వర్షాలు పెరిగే అవకాశాలున్నాయని

వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఈనెల ఆరంభంలో దేశంలోకి రావాల్సిన రుతుపవనాలు వారం రోజులు ఆలస్యంగా ప్రవేశించాయి. దీనికి తోడు ఎనిమిది రోజులుగా వాటికి కదలిక నిలిచిపోయింది. దీంతో ఈనెల మొదటి 15  రోజుల్లో సాధరణం కన్నా 22 శాతం తక్కువగా వర్షపాతం నమోదైనట్లు వాతవారణశాఖ తెలిపింది.