తెలంగాణకేమిచ్చారు?
` 12 ఏళ్లుగా అధికారంలో కొనసాగుతున్నారు
` భాజపాకు సీఎం రేవంత్ సూటి ప్రశ్న
` రెండేళ్ల అభివద్దిని చూసి ఓటేయండి
` పట్టణాల అభివద్ది కేవలం కాంగ్రెస్‌తోనే సాధ్యం
` రాష్ట్రంలో అనేక పథకాలతో అభివద్ది, సంక్షేమాన్ని చేపట్టాం
` మోడీకి, మున్సిపల్ ఎన్నికలకు సంబంధం ఏమిటి?
` తెలంగాణ రూపాయి ఇస్తే..42 పైసలే వాపస్ వస్తున్నాయి
` ఉత్తరాది బీహార్, యూపిలతో పోలిస్తే దారుణమైన పరిస్థితి
` దక్షిణాది రాష్టాలపై కక్షగట్టిన ప్రధాని మోడీ
` దక్షిణాది సొమ్మతో ఉత్తరాది రాష్ట్రాలకు సోకు
` ఇద్దరు కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్‌లు ఏం చేస్తున్నట్లు?
` మీడియా సమావేశంలో సిఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్(జనంసాక్షి): మున్సిపల్ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్‌కు ఓటేయాలని, దీంతో మున్సిపాలిటీల్లో అభివద్దికి ప్రభుత్వానికి అవకాశం ఉంటుందని సిఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. పదేళ్ల బిఆరఎస్ పాలన, 12 ఏళ్ల మోడీ పాలన, రెండేళ్ల కాంగ్రెస్ పాలనను బేరీజు వేసుకుని అభివద్దికి పట్టం కట్టాలన్నారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారం ముగిసిన వేళ సిఎం రేవంత్ రెడ్డి సోమవారం సాయంత్రం విÖడియాతో మాట్లాడారు. మున్సిపల్ ఎన్నికలకు మోడీకి సంబంధం ఏమిటని ప్రశ్నించారు. మోడీ ముఖం చూసి ఓటేయమని బిజెపి అడగడాన్ని ఎద్దేవా చేశారు. బిజెపి అధ్యక్షుడు ప్రచారంలో పాల్గొన్నా రాస్టానికి ఒక్క పైసా ఉపయోగం లేదన్నారు. ఇద్దరు కేంద్రమంత్రులు ఉన్నా రాష్టానికి ఒరిగిందేవిÖ లేదన్నారు. తెలంగాణ రాష్ట్రం దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకలా నిలుస్తూ భారీగా పన్నులు చెల్లిస్తున్నప్పటికీ, కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్టానికి దక్కాల్సిన వాటాలో తీవ్ర అన్యాయం జరుగుతోందని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. దక్షిణాది రాష్టాలను చిన్నచూపు చూస్తూ ఉత్తరాది రాష్టాల్రకు కేంద్రం పెద్దపీట వేస్తోందని ఆయన మండిపడ్డారు. ముఖ్యంగా పన్నుల పునఃపంపిణీలో కేంద్రం అనుసరిస్తున్న తీరును ఆయన గణాంకాలతో సహా ఎండగట్టారు. తెలంగాణ నుంచి కేంద్రానికి వెళ్తున్న ప్రతి రూపాయికి ప్రతిఫలంగా రాష్టానికి కేవలం 42 పైసలు మాత్రమే తిరిగి వస్తున్నాయని, ఇది రాష్ట్ర ప్రయోజనాలపై గొడ్డలి పెట్టు అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర పన్నుల వాటా పంపిణీలో ఉత్తరాది రాష్టాలకు అందుతున్న నిధులపై సీఎం రేవంత్ రెడ్డి విరుచుకుపడ్డారు. తెలంగాణ వంటి అభివద్ధి చెందుతున్న రాష్టానికి నుంచి నిధులను సేకరించి, ఇతర రాష్టాలకు కట్టబెడుతున్నారని ఆయన విమర్శించారు. ఉత్తరప్రదేశ్ రూపాయి పన్ను చెల్లిస్తే కేంద్రం ఆ రాష్టానికి 2 రూపాయలు తిరిగి ఇస్తోందని, ఇక బీహార్ విషయానికొస్తే రూపాయికి బదులుగా ఏకంగా 6 రూపాయలు నిధులుగా వెళ్తున్నాయని ఆయన వివరించారు. ఈ స్థాయి వివక్షపై తెలంగాణ నుంచి గెలిచిన బీజేపీ ఎంపీలు కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఎప్ప్పుడైనా పార్లమెంట్‌లో నోరు మెదిపారా అని ఆయన నిలదీశారు. రాష్ట్రం నుంచి 8 మంది ఎంపీలను గెలిపించినందుకు తెలంగాణకు విÖరు చేసిన మేలేమిటని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రంలో బీజేపీ, బీఆరఎస్ పార్టీలు పైకి విమర్శలు చేసుకుంటున్నప్పటికీ, లోపల మాత్రం ఆ రెండు పార్టీలు ఒక్కటేనని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. గతంలో కేంద్రం ప్రవేశపెట్టిన వివాదాస్పద రైతు వ్యతిరేక చట్టాలకు బీఆరఎస్ బేషరతుగా మద్దతు తెలిపిందని ఆయన గుర్తు చేశారు. అంతేకాకుండా, నోట్ల రద్దు సమయంలో కేసీఆర్ అసెంబ్లీని ప్రత్యేకంగా ఏర్పాటు చేసి మరీ ప్రధాని మోదీని అభినందించిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. మోదీ ప్రేమలో అమరత్వం పొందుతానని గతంలో కేసీఆర్ చెప్పలేదా అని ఆయన ఎద్దేవా చేశారు. పిల్లి కళ్లు మూసుకొని పాలు తాగినట్లుగా వీరిద్దరి మధ్య ఉన్న అనుబంధం బయటపడదని అనుకుంటున్నారని, కానీ బీఆరఎస్ , బీజేపీ మధ్య పక్కాగా ’క్విడ్ ప్రో కో’ ఒప్పందం నడుస్తోందని ఆయన ఆరోపించారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి అక్రమాలపై కేంద్ర దర్యాప్తు సంస్థలు ఎందుకు మౌనంగా ఉన్నాయని ముఖ్యమంత్రి ప్రశ్నించారు. అత్యంత ఖరీదైన ఫార్ములా`ఈ కారు రేస్ అక్రమాలకు సంబంధించిన ఫైల్స్ ఈడీ వద్ద ఉన్నా చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని నిలదీశారు. అలాగే, కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన భారీ అవినీతిపై సీబీఐకి ఫిర్యాదు చేసినా కేంద్రం ఉదాసీనంగా వ్యవహరించడం వెనుక ఉన్న మర్మమేమిటని అడిగారు. బీఆరఎస్ నాయకులను కాపాడేందుకే బీజేపీ ఈ కేసులను అటకెక్కించిందని రేవంత్ రెడ్డి ఘాటుగా విమర్శించారు. తెలంగాణ ప్రజల హక్కుల కోసం తన ప్రభుత్వం పోరాటం కొనసాగిస్తుందని, కేంద్రం నుంచి రావాల్సిన ప్రతి పైసాను సాధించుకుంటామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో త్రిముఖ పోరు నెలకొందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. భవిష్యత్తును ఆలోచించుకొని ఓటు వేయాలని ప్రజలను కోరారు. 12 ఏళ్లుగా కేంద్రంలో ఉన్న భాజపా.. తెలంగాణకు ఏమైనా ప్రాజెక్టులు మంజూరు చేసిందా? అని ప్రశ్నించారు.పాలమూరు`రంగారెడ్డిని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటిస్తామని ప్రధాని మోదీనే స్వయంగా హావిÖ ఇచ్చారు. వాటి గురించి చెప్పట్లేదు.. కానీ, మోదీని చూసి ఓటేయాలని భాజపా నేతలు అడుగుతున్నారు. వరదల్లో నీటమునిగిన వస్తువులన్నీ కేంద్రం నుంచి నిధులు తెచ్చి తిరిగిస్తామని గత జీహెచఎంసీ ఎన్నికల్లో బండి సంజయ్ హావిÖ ఇచ్చారు. ఆ హావిÖని నమ్మి ఆ పార్టీకి చెందిన 50 మందిని కార్పొరేటర్లుగా గెలిపించారు. ఎన్నికలయ్యాక అడిగితే.. వస్తువులకు బీమా ఉంటుందని బండి సంజయ్ మాటమార్చారు. తెలంగాణకు రూ.లక్షల కోట్లు ఇచ్చామని భాజపా నేతలు చెబుతున్నారు. దీనిపై సీఎస్‌ను వివరణ అడిగితే.. మనం రూపాయి చెల్లిస్తే.. కేంద్రం 42 పైసలు ఇస్తోందని చెప్పారు. కేంద్రానికి వచ్చే పన్నుల్లో దక్షాణాది రాష్టాల్రే 40 శాతానికి పైగా చెల్లిస్తున్నాయి. తెలంగాణకు వచ్చిన ఐటీఐఆర్ ప్రాజెక్టును రద్దు చేశారు. హైదరాబాద్‌కు వచ్చిన సెవిÖకండక్టర్ ప్రాజెక్టును మోదీ ఒత్తిడి చేసి.. ఏపీకి తరలించారు. ఇప్పడు మోదీని చూసి ఓటేయాలని భాజపా నేతలు అడుగుతున్నారు. అసలు మున్సిపల్ ఎన్నికలకు మోదీకి ఏం సంబంధం? భాజపా నేతలకు దేవుడు అసదుద్దీన్ ఒవైసీ. ఆయన పేరు లేకుండా ఆ నేతల ప్రచారం ఉండదు. మత రాజకీయాల ద్వారా భాజపా రాజకీయ మనుగడ సాగిస్తోందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ఇకపోతే తెలంగాణ కోరిన మూసీ రివర్ ఫ్రంట్, ట్రిపుల్ ఆర్, మెట్రో విస్తరణ వంటి పథకాలపై ఎలాంటి కదలిక లేదన్నారు. అయితే తెలంగాణ అభివద్దికి తాము రెండేళ్లలో అనేక పనులు చేపట్టామని అన్నారు.
2.కవితను జైలుకు పంపి కేటీఆర్, హరీశ్ సీఎం అవుదామనుకుంటున్నారు
` కలిసి సంపాదించారు. పంపకాల్లో తేడా వచ్చి కొట్టుకుంటున్నారు
` విలేకరులతో ఆయన ఇష్టాగోష్ఠిలో సీఎం రేవంత్‌రెడ్డి
హైదరాబాద్(జనంసాక్షి): ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎసఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు కీలక వ్యక్తి అని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో విలేకరులతో ఆయన ఇష్టాగోష్ఠి నిర్వహించారు. ప్రభాకర్‌రావు 20 నెలలు విదేశాల్లో ఉన్నారని చెప్పారు. ఆయన్ను భారత్‌కు తీసుకురావడానికి కేంద్రం సహకరించలేదన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో ప్రభాకర్‌రావును స్వదేశానికి తీసుకొచ్చామని తెలిపారు. ఆ తర్వాతే కేసు విచారణ వేగవంతమైందన్నారు. జనాభా ప్రాతిపదికన డీమిలిటేషన్‌తో మనకే నష్టం వాటిల్లుతుందని చెప్పారు.తిరుమల శ్రీవారి లడ్డూ కల్తీ వ్యవహారంపై సీఎం రేవంత్‌రెడ్డి స్పందిస్తూ.. అది ఏపీ అంశమని అన్నారు. తెలంగాణలోని అన్ని ఆలయాల్లో విజయ డెయిరీ నెయ్యిని వాడుతున్నట్లు చెప్పారు. బీఆరఎస్ గురించి మాట్లాడుతూ.. కవిత జైలుకు వెళ్తే సీఎం అవుదామని.. హరీశ్, కేటీఆర్ ఎదురుచూస్తున్నారని వ్యాఖ్యానించారు. మన ఇంటి బిడ్డను మంచిగా చూసుకుంటే ఈ సమస్యలు ఉండవన్నారు. “మన ఇంటి సమస్యను మనమే పరిష్కరించుకోవాలి. కలిసి సంపాదించారు. పంపకాల్లో తేడా వచ్చి కొట్టుకుంటున్నారు” అని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు.
ఎన్నికల్లో సమన్వయంతో ముందుకు సాగాలి
ప్రతి ఒక్కరూ ఓటేసాలా చూసుకోవాలి
పార్టీ నేతలకు సిఎం రేవంత్ దిశానిర్దేశం
హైదరాబాద్,ఫిబ్రవరి9(జనంసాక్షి): మున్సిపల్ ఎన్నికల్లో నేతలు సమన్వయంతో ముందుకెళ్లాలని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి సూచించారు. ఎన్నికల ప్రచారం, ఇతర అంశాలపై కాంగ్రెస్ ముఖ్యనేతలు, మంత్రులతో సీఎం జూమ్ విÖటింగ్ నిర్వహించారు. ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ విÖనాక్షి నటరాజన్, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, డీసీసీ అధ్యక్షులు పాల్గొన్నారు. పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా పార్టీ స్థితిగతులపై సీఎం రేవంత్ ఆరా తీశారు. బలహీనంగా ఉన్న మున్సిపాలిటీల్లో పోలింగ్ వ్యూహంపై చర్చించారు. స్థానిక నేతల నేతత్వంలో పోల్ మేనేజ్‌మెంట్ జరిగేలా చూడాలని మంత్రులకు సూచించారు. ప్రతి ఓటరూ పోలింగ్ కేంద్రానికి వచ్చేలా చూడాలన్నారు. ఇవాళ, రేపు ఓటర్లకు నేతలు అందుబాటులో ఉండాలని రేవంత్‌రెడ్డి దిశానిర్దేశర చేశారు.ప్రతి ఓటరు బూత్ దగ్గరకు చేరుకునేలా చూడాలన్నారు. ఏమరుపాటు పనికిరాదన్నారు. ప్రతి ఒక్కరూ ఓటేసాల చూడాలన్నారు.


