తెలంగాణకోసం ప్రధాని అపాయింట్‌మెంట్ కోరిన టీ మంత్రులు
హైదరాబాద్: ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అంశంపై మాట్లాడేందుకు అక్టోబర్ 20తర్వాత సమయం కేటాయించాల్సిందిగా ప్రధాని మన్మోహన్‌సింగ్‌కు టీ మంత్రులు విజ్ఞప్తి చేశారు. జీవ వైవిద్య సదస్సుకోసం హైదరాబాద్‌కు వచ్చిన మన్మోహన్‌సింగ్‌ను బేగంపేట విమానాశ్రయంలో తెలంగాణకు చెందిన కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు ఎంపీలు మొత్తం 135మంది ప్రజాప్రతినిథులు కలుసుకున్నారు. తెలంగాణమంత్రుల తరపున రాష్ట్రమంత్రి కె.జానారెడ్డి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంబందించిన విఝ్ఞాపన పత్రాన్ని సమర్పించారు. ఇందుకుగాను ఆయనకు లబించిన సమయం ఒక్కనిమిషం మాత్రమే కావటం గమనర్హం. తెలంగాణపై మాట్లాడేందుకు సమయం ఇవ్వాలన్న తెలంగాణ మంత్రుల విజ్ఞప్తికి ఆయన సానుకూలంగా స్పందిచారని ఈ నేపథ్యంలో అక్టోబర్ 18న మంత్రుల బృందం ఢిల్లీ వెళ్లనున్నట్లు విలేకరులతో జానారెడ్డి తెలిపారు.