తెలంగాణ పై అతి త్వరలో నిర్ణయం : చిదంబరం
ఢిల్లీ:తెలంగాణపై వీలైనంత త్వరగా కేంద్రం నిర్ణయం తీసుకుంటుందని కేంద్ర హోంమంత్రి చిదంబరం అన్నారు.3325 మంది ఐపీఎస్ అదికారులు తమ అస్తులను ప్రకటించారని,ఇంకా 500 మంది ఐపీఎస్ అధికారులు తమ అస్తులను వెల్లడించాల్సి వుందని చిదంబరం పేర్కోన్నారు.హోంశాఖ నెలవారీ సమీక్షలో భాగంగా ఆయన మాట్లాడుతూ 18 కిలోమీటర్లు పొడవున కేబుల్ లైన్లు విస్తరించామని తెలిపారు.మక్కామసీదు పేలుళ్ల కేసులో సందీవ్ డాంగే రాంచంద్ ఖల్సాలను అరెస్టు చేసినట్లు చెప్పారు.ముంబయిలో మారణకాండ సృషించిన బృందంలో అబూ ఓ సభ్యడని పాక్ కంట్రోల్ రూం నుంచి ముంబయి దాడులకు అబూ సూచనలిచ్చిన అంశాన్ని పాక్ అంగీకరించిలని చిదంబరం పేర్కొన్నారు.తమ జాతీయడేనని సౌదీతో చెప్పిన అంశాన్ని పాక్ ఒప్పుకోవాలని ఆయన అన్నారు.