తెలంగాణలో అడుగుపెట్టిన జోడో యాత్ర

అశ్వరావుపేట అక్టోబర్ 23( జనం సాక్షి )

దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా రాహూల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర తెలంగాణలోకి ప్రవేశించిన సంధర్భంగా అశ్వరావుపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎం.చెన్నకేశవరావు ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మునుగోడు ప్రచార అనంతరం రాహుల్ గాంధీ కి స్వాగతం పలికారు.ఈ కార్యక్రమంలో చెన్నకేశవరావు మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం మరియు మోడీ నిరంకుశ పాలనలో జరిగే అన్యాయాన్ని ప్రజలకు వివరిస్తూ ,ప్రజలను మోడీ మరియు కాంగ్రెసేతర రాష్ట్ర ముఖ్యమంత్రులు వారి ప్రభుత్వాలు ప్రజలను ఎలా నయవంచనకు గురిచేస్తున్నారు అనే విషయాలను తెలియజేస్తూ ఈ యాత్ర కొనసాగుతుందని,జోడో యాత్ర జరిగిన రాష్ట్రాల్లో ప్రజలు రాహుల్ గాంధీ కి బ్రహ్మ:రథం పడుతున్నారని అలాగే తెలంగాణలో కూడా అన్ని వర్గాల ప్రజలు ఈ జోడో యాత్రను విజయవంతం చేయాలని కోరారు.