*తెలంగాణలో బిజెపి జెండా ఎగరవేయడం ఖాయం*
*బిజెపి మండల అధ్యక్షుడు దాసరి తిరుపతిరెడ్డి*
*మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన భారతీయ జనతా పార్టీ శ్రేణులు*
రేగొండ (జనం సాక్షి): రానున్న ఎన్నికల్లో తెలంగాణలో బిజెపి జెండా ఎగవేయడం ఖాయమని ఆ పార్టీ మండల అధ్యక్షుడు దాసరి తిరుపతిరెడ్డి అన్నారు. సోమవారం రేగొండ మండల కేంద్రంలో బీజేపీ మండల శాఖ ఆధ్వర్యంలో భారత ప్రధానమంత్రి గౌరవ శ్రీ నరేంద్ర మోడీ దేశంలోని రైతులందరికీ కిసాన్ సమ్మెను నిధి ధ్వరా రైతుల అకౌంట్ లో పంట పెట్టుబడి కి ఆర్థిక సహాయం కింద రెండు వేల రూపాయలను అకౌంట్లో జమ చేసినందుకు గాను ఆయన చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా బిజెపి మండలాధ్యక్షుడు దాసరి తిరుపతి రెడ్డి, కిసాన్మోర్చా జిల్లా అధ్యక్షుడు పొలసాని తిరుపతి రావు మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ రైతు పక్ష పార్టీ అని అన్నారు. దేశానికి రైతే వెన్నుముక అలాంటి రైతుకు ఆర్థికంగా చేయూతను అందించడానికి మోడీ సమ్మాన్ నిధి ద్వారా రైతులను ఆదుకుంటున్నారని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు ప్రధానమంత్రి ప్రవేశపెట్టిన ఫసల్ బీమా యోజనను రాష్ట్రంలో అమలు చేయడం లేదని దీంతో రైతులను తీవ్రంగా నష్ట పోతున్నారని అవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వలన ఫసల్ బీమా ను రాష్ట్రంలో అమలు చేయడం లేదని ఆరోపించారు. రైతులకు లక్ష రూపాయల రుణమాఫీ చేస్తానని చెప్పి రైతులను మోసం చేశారని అన్నారు. రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అధికారం చేపడుతుందని జోష్యం చెప్పారు. అధికారం వచ్చిన వెంటనే ఉచిత విద్య, వైద్యం, రైతు సమస్యల పైన ప్రత్యేకంగా దృష్టి ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఏడునుతుల నిశిధర్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు లింగంపల్లి ప్రసాద్ రావు, జిల్లా కార్యవర్గ సభ్యులు మెతుకు పెళ్లి బుచ్చిరెడ్డి, కిసాన్మోర్చా మండల అధ్యక్షుడు గన్ రెడ్డి లింగ రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి సురుగురి రాజేందర్రెడ్డి, నాయకులు పెండ్యాల రాజు, రాజేందర్ నాయక్, కూరాకుల మల్లయ్య, ఆదిరెడ్డి, కౌడాగాని రాకేష్ , మాచర్ల వరప్రసాద్, అన్నరపు సమ్మిరెడ్డి, పున్నం రఘు తదితరులు ఉన్నారు.