తెలంగాణలో బిజెపి ప్రభుత్వం తద్యం
తెలంగాణలో బిజెపి ప్రభుత్వం తద్యం
నేరేడుచర్ల (జనంసాక్షి)న్యూస్.తెలంగాణలో కెసిఆర్ ప్రభుత్వానికి నిరుద్యోగులు తగిన బుద్ధి చెప్పాలి.తెలంగాణ రాష్ట్రంలో కెసిఆర్ ప్రభుత్వం యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో పూర్తిగా విఫలం చెందిందని హుజూర్ నగర్ బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థి చల్లా శ్రీలత రెడ్డి అన్నారు. నేరేడుచర్ల మున్సిపల్ కేంద్రంలో నేరేడుచర్ల పట్టణం, పాలకీడు మండలానికి చెందిన వివిధ పార్టీల 50మంది యువకులు శ్రీలత రెడ్డి ఆధ్వర్యంలో బిజెపి పార్టీలో చేరారు. వారికి బిజెపి కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో యువతకు ఉద్యోగ నోటిఫికేషన్లు వేయకుండా కేసీఆర్ ప్రభుత్వం తాత్సారం చేసిందని ఆరోపించారు. టీఎస్పీఎస్సీ ద్వారా గ్రూప్స్ నోటిఫికేషన్లు వేసి పేపర్ లీకేజీ చేసినా ఘనత తెలంగాణ ప్రభుత్వానికి చెల్లిందని ఎద్దేవ చేశారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం యువతకు ఉపాధి కల్పించాలని ఉద్దేశంతో ముద్ర లోన్స్, అనేక యువజన పథకాలు అమలు చేస్తుందని తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇస్తున్న నిధులతో చేస్తున్న అభివృద్ధి పనులకు కేంద్ర ప్రభుత్వం పేరు చెప్పకుండా రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. ఒకప్పుడు భారత్ దేశం అంటే ప్రపంచంలో గుర్తింపు లేదని, నరేంద్ర మోడీ చెరువుతో ప్రపంచ దేశాలు సైతం భారతదేశ వైపు చూస్తున్నాయని అన్నారు. ఈ ఘనత బిజెపి పాలనలో నరేంద్ర మోడీ తోనే సాధ్యమైందని పేర్కొన్నారు. దేశ రక్షణ కోసం, దేశ జాతీయతాభావాల్ని యువత పెంపొందించుకొని బిజెపి పార్టీతో కలిసి నడవాలని కోరారు. హుజూర్ నగర్ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున పరిశ్రమలు ఉన్నా కూడా స్థానిక యువతకు పరిశ్రమల్లో ఉపాధి కల్పించడంలో కూడా ఈ ప్రభుత్వాలు విఫలం చెందాయని అన్నారు.రాబోయే ఎన్నికల్లో ఈ నియోజకవర్గంలో కచ్చితంగా బిజెపి జెండా ఎగురుతుందని ధీమా వ్యక్తం చేశారు.బిజెపిలో చేరిన వారిలో పాలకీడు మండలం యువకులు శ్రీనివాస్ రెడ్డి, వంశీ, శ్రీను,శివ,నాగర్జున, నేరేచర్ల పట్టణానికి చెందిన యువకులు గణేష్, మహేష్, యాకూబ్, సుధీర్ , సంతోష్ , వెంకట్, హుస్సేన్, గంగారెడ్డి లతోపాటు మరో 30 మంది యువకులు ఉన్నారు.ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు బాల వెంకటేశ్వర్లు, పట్టణ అధ్యక్షులు సత్యనారాయణ రెడ్డి, ప్రధాన కార్యదర్శి కొనతం నాగిరెడ్డి, సీనియర్ నాయకులు తాళ్లూరి రమేష్, యు.రామ్మూర్తి, శంకర్ రెడ్డి,నాగేశ్వర్ రావు, శ్రీకాంత్,నాగయ్య తదితరులు పాల్గొన్నారు.