తెలంగాణవాదాన్ని అణచేందుకే ..
కిరణ్, జగన్ కుమ్మక్కయ్యారు
విజయమ్మ దీక్ష నాటకం.. నేత కార్మికులపై ఆమె ప్రేమ బూటకం
ఎంపీ మధుయాష్కీల
న్యూఢిల్లీ, జూలై 23 (జనంసాక్షి): తెలంగాణ వాదాన్ని అణిచివేసేందుకే సీఎం కిరణ్, జగన్‌లు అడుతున్న నాటకమే సిరిసిల్ల దీక్ష అని నిజామాబాద్ ఎంపీ మధుయాష్కి అన్నారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ చేనేత కార్మికులపై ఆమెది కపటప్రేమని ఆమె దీక్ష వట్టి బూటకమని ఆయన విమర్శించారు. తెలంగాణలో నెలకొన్న శాంతియుత వాతావరణాన్ని భగ్నం చేసేందుకు కిరణ్‌రెడ్డి, జగన్‌రెడ్డిలు కలిసి విజయమ్మతో నాటకం ఆడిస్తున్నారన్నారు. తెలంగాణ ప్రజలపై విజయమ్మ దండయాత్ర చేసారని ఆయన మండిపడ్డారు. విద్యార్ధులపై జరిగిన లాఠీ ఛార్జీని ఆయన ఖండించారు. మధుయాష్కి వెంట తెలంగాణ ఎంపీలు పొన్నం ప్రభాకర్, మంద జగన్నాదం తదితరులున్నారు.


