తెలంగాణాలో రైతులు లేరా: హరీష్‌రావు ప్రశ్న
తెలంగాణ ప్రాంతలోని రైతాంగం కష్టాల్లో ఉంటే సీఏం కిరణ్,చంద్రబాబు సీమాంద్రా చుట్టూ తిరుగుతున్నారు
వరంగల్: నవంబర్ 5, (జనంసాక్షి):
తెలంగాణ ప్రాంతంలో రైతులు లేరా.? నీలం తుఫాను ప్రభావం కారణంగా కురుస్తున్న భారీ వర్షాలవల్ల తెలంగాణ ప్రాంతంలోని రైతులు నష్టపోవడం లేదా అని తెలంగాణ రాష్ట్ర సమితి ఎమ్మెల్యే టి.హరీష్ రావు ప్రశ్నించారు. వరంగల్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ నీలం తుఫాను వల్ల కురుస్తున్న భారీ వర్షాలతో కేవలం కోస్తాంద్ర రైతులు మాత్రమే కాకుండా తెలంగాణలోని రైతులు కూడా తీవ్రంగా నష్టపోయారన్నారు. వీరిని సీమాంద్ర పాలకులు పరామర్శించరా అని ప్రశ్నించారు.తెలంగాణ ప్రాంతలోని రైతాంగం కష్టాల్లో ఉంటే సీఏం కిరణ్,చంద్రబాబు సీమాంద్రా చుట్టూ తిరుగుతున్నారని అగ్రహంవ్యక్తం చేశారు.ఆదిలాబాద్,వరంగల్ జిల్లాల్లో 30 లక్షల క్వింటాళ్ల పత్తి నష్టం జరిగిందని తెలిపారు.పత్తి రైతులను ఆదుకోవాలని ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు.ఈ విషయంలో అవసరమైతే జైలుకైనా వెళ్ళడానికైనా సిద్దమని చెప్పారు.