*తెలంగాణ ఆడపడుచులకు నిజమైన తోబుట్టువు సీఎం కేసీఆర్ చైర్ పర్సన్

వనపర్తి శిరీష*
కోదాడ సెప్టెంబర్ 21 (జనం సాక్షి) ఈరోజు 0
 కోదాడ పురపాల సంఘము పరిధి లోని తమ్మర మరియు పట్టణం లోని ముస్లిం శాదిఖాన లో ఐసిడిఎస్ కోదాడ వారి ఆధ్వర్యంలో జరిగినటు వంటి పోషణ అభియాన్,పోషణ మాసం కార్యక్రమం లో ముఖ్య అతిథిగా  మునిసిపల్ చైర్ పర్సన్ వనపర్తి శిరీష లక్ష్మీనారాయణ హాజరై పట్టణ పరిధి లోని గర్భిణీ స్త్రీలకు సలహాలు సూచనలు ఇచ్చి వారికి శ్రీమంతం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన పోషణ అభియాన్, పోషణ మాసం పథకంను గర్భిణీ స్త్రీలు, బాలింతలు, చిన్నారులు సద్వినియోగం చేసుకోని, తక్కువ ఖర్చుతో ఎక్కువ పోషకాలు ఎలా పొందాలో తెలుసుకొని, తినే ఆహారంలో పోషకాలు నష్టపోకుండా చూసుకోవాలని తెలిపారు. గర్భిణీలు రక్తహీనతకు గురికాకుండా ఐరన్ సంబంధిత ఆకుకూరల రోజుకి ఒక్కసారి అయిన తీసుకోవాలి అని, అంగన్ వాడి లో లభించే గుడ్లు మరియు బాలామృతం ద్వారా పోషకాలు ఎక్కువగా పొందవొచ్చు అని తెలిపారు.అనంతరం గర్భిణీ స్త్రీలకు శ్రీమంతం,పిల్లలకు అన్నప్రసన్న మరియు అక్షరాభిశేకం చేశారు.ఈ కార్యక్రమం లో వీరితో పాటు కౌన్సిలర్స్ సామినేని నరేష్, హనుమంతరావు,సిడిపిఓ విజయ చంద్రిక,సూపర్వైజర్  శివకుమారి, రమణ,అంగన్వాడీ టీచర్స్ కుడుముల రాధరుక్మిణీ, తయ్యబు,సీత,స్వరూప,లాల్బీ, వెంకటరమణ,రమ,జాన్వీ తదితరులు పాల్గొన్నారుh