తెలంగాణ ఆదర్శ కళాశాల మరియు పాఠశాల విద్యార్థుల అద్భుత ప్రతిభ

నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండలం, అంబం(ఆర్) గ్రామంలోని తెలంగాణ స్టేట్ మోడల్ స్కూల్   పదవ తరగతి ఫలితాలలో వంద మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కాగా 99 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారని, 99 శాతం ఉత్తీర్ణత సాధించారని, నలుగురు విద్యార్థులు అనురాగ్ ,దీన, పూజిత వాణి, రజిత 9.8 gpa సాధించారని 9 కన్నా ఎక్కువ జీపీఏ 30 మంది విద్యార్థులు సాధించారని,  మొత్తం బాలురు  44 మంది కాగా అందులో 43 మంది పాసయ్యారని, మొత్తం
బాలికలు  56 మంది కాగా అందులో మొత్తం 56 మంది పాసయ్యారని తెలిపారు అలాగే. జూలై 28 న వెలువడిన ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాలలో తెలంగాణ ఆదర్శ కళాశాల విద్యార్థులు అద్భుత ప్రతిభ చూపించారని ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ఫలితాలు, ఎంపీసీలో 93% జి.జూహిత రమ్య (444/470)
బైపీసీలో 93% జే  సుచరిత ,కె.ప్రియాంక (431/440) ,ఎంఈసీ లో 82 శాతం కే.జోత్స్నా(425/550), సిఈసి లో 52% కే మమత (409/500) ఉత్తీర్ణత సాధించారు. ఈ సంవత్సరం ఉత్తీర్ణత శాతం 83.33%..ఉందని.
ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరం ఫలితాలు
ఎంపీసీ లో 97% కె.విజిత (967/1000)
బైపీసీలో 97 శాతం  బి.నిఖిత (943/1000)
ఎంఈసి లో 86%  టి.విజయేశ్వరి (823/1000)
సిఈసీ లో 71% ఎల్.నవీన (814/1000) ఉత్తీర్ణత సాధించారు. రెండవ సంవత్సరం ఉత్తీర్ణత శాతం 90% అద్భుత ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు  ప్రిన్సిపల్ ఆలూరు నరేందర్ విద్యార్థులకు అభినందనలు  తెలిపారు