తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌పై రాళ్లా!?
– ఫిరాయింపులతో బంగారు తెలంగాణ సాధిస్తారా?
– దుస్సాంప్రదాయంపై పోరాడుతా
– విలేఖరుల సమావేశంలో జానారెడ్డి ఆక్రోశం
హైదరాబాద్,జూన్ 14(జనంసాక్షి): కాంగ్రెస్ శాసనసభా పక్ష పదవికి, మిగిలిన అన్ని పదవులకూ రాజీనామా చేస్తానని కె జానారెడ్డి ప్రకటించి సంచలన ప్రకటనచేశారు. బంగారుత ఎలంగాణ పేరుతో రాజ్యాంగాన్ని భ్రష్టు పట్టిస్తూ చేరికలను ప్రోత్సహిస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికే సంక్షుభితంగా ఉన్న తెలంగాణా కాంగ్రెస్ లో ఆయన ప్రకటన మరో మలుపు కానుంది. తాజా పరిణామాలు నాకు వేదన కల్గించాయి. ముఖ్యంగా అధికార పార్టీ అనుసరిస్తున్న తీరు చూశాక ఎందుకు నాకీ పదవులు అనిపించింది. ఈ ఫిరాయింపులకు వ్యతిరేకంగా పదవులను త్యాగం చేయాలని నిర్ణయించాం. దీనిపై కాంగ్రెస్ అధినేత సోనియాగాంధీ తో మాట్లాడాక తుదినిర్ణయం తీసుకుంటాం. నాకు పదవులపై ఆశలేదు. ఇంత కంటే పెద్ద పదవి ఇచ్చినా అఖ్ఖర్లేదు. సోనియా ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చారు. అందుకు కృతజ్ఞుణ్ణి. కానీ అటు కేసీఆం గానీ, తెలంగాణా మేధావులు, ప్రజలు గానీ ఒక్క విషయం ఆలోచించాలి. మనం కోరుకుంటున్న బంగారు తెలంగాణా ఇదేనా ? ఫిరాయింపులతో బంగారు తెలంగాణా వస్తుందా ? భ్రష్ట తెలంగాణా వస్తుంది.. బంగారు తెలంగాణా కాదు. ఈ భ్రష్ట తెలంగాణా రావాలని, సామాజిక, ప్రజాస్వామిక న్యాయం లేని తెలంగాణా కావాలని మనమేనాడైనా కోరుకున్నామా? ” అని జానారెడ్డి ఆవేదన చెందారు. మంగళవారం అయన సిఎల్పీలో కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, షబ్బీం అలీలతో కలసి విూడియా సమావేశంలో ప్రసంగించారు. గుత్తా సుఖేందం రెడ్డి, వివేచీ, వినో’, భాస్కరరావు మొదలైన నేతలు టీఆంఎస్‌లో చేరతామని ప్రకటించిన దశలో జానా తీవ్ర ఆవేదన చెందారు. తనకు ఏ పదవిపై ఆశలేదు…సీఎల్పీ సహా అన్ని పదవులు వదులుకుంటానని జానారెడ్డి స్పష్టం చేశారు. సోనియాకు చెప్పిన తర్వాత నిర్ణయం తీసుకుంటానని ఆయన తెలిపారు.తెలంగాణలో టీఆంఎస్ వైఖరి ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా ఉందని మండిపడ్డారు.
ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా సోనియా తెలంగాణ ఇచ్చారన్నారు. అవసరం వచ్చినప్పుడల్లా ప్రభుత్వానికి సహకరిస్తున్నామని…అయినా కాంగ్రెస్ పట్ల టీఆంఎస్‌కు కృతజ్ఞతలేదని ధ్వజమెత్తారు. దీనికి తాను ఈ వయసులో పోరాడడానికి సిద్దమని, ప్రజలు కలసి వస్తే ప్రజాస్వామ్యం కోసం పోరాడుతానని అన్నారు. తెలంగాణలో పార్టీ ఫిరాయింపులు జుగుప్సాకరమని వ్యాఖ్యానించారు. పార్టీ మారిన వారికి ప్రజలు సరైన సమయంలో బుద్ధి చెప్పాలన్నారు. మేధావులు, ఉద్యోగులు, విద్యార్థులు కోరుకున్న తెలంగాణ ఇదేనా? అని జానా ప్రశ్నించారు. పార్టీ మారినవారిపై అనర్హత వేటు వేయాలని కోర్టుకు వెళ్తామని తెలిపారు. ఫిరాయింపులకు అడ్డుకట్ట వేసేందుకు కేంద్రం చర్యలు తీసుకోవాలని డిమాాం చేశారు. బంగారు తెలంగాణ అంటూ భ్రష్టుపట్టిన రాజకీయాలు చేస్తున్నారని జానారెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తెలంగాణ రాష్ట్రంలో సామాజిక న్యాయంతో పాటు ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుందని ప్రజలు భావించారని జానారెడ్డి అన్నారు. తెరాస ప్రభుత్వం అనుసరిస్తున్న అప్రజాస్వామిక, అనైతిక ఫిరాయింపులను తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. అభివృద్ధి ముసుగులో అనైతిక రాజకీయాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. రాష్ట్రంలో ఆరోగ్యవంతమైన రాజకీయాలు వెల్లివిరుస్తాయని, అనేక సంవత్సరాల ఆకాంక్షలు నేరవేరతాయని అందరూ భావించారని పేర్కొన్నారు. ఇతర పార్టీల సహకారంతో సోనియాగాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారు. రాష్ట్ర ప్రజల ఆశల మేరకు అధినేత్రి సోనియా సాహసోపేత నిర్ణయం తీసుకున్నారు. ఆనాడు తామంతా తమ హయాంలో ప్రత్యేక తెలంగాణ రావాలని పోరాడామని అన్నారు. ఎంపిలు, ఎమ్మెల్యేలు పోరాడి తెలంగాణ సాధించారని,కానీ ప్రస్తుత తెరాస ప్రభుత్వానికి కాంగ్రెస్‌పై కృతజ్ఞత కూడా లేదన్నారు. తెరాస ప్రభుత్వ తీరు హేయమైనది.. ప్రజలు అంతా గమనిస్తున్నారన్నారు. ప్రజలు, మేధావులు ఆశించిన విధంగా పాలన లేదన్నారు. పార్టీ ఫిరాయింపులకు నిరసనగా పదవులు త్యాగం చేసేందుకు సిద్ధమని ప్రకటించారు.