తెలంగాణ ఏ, సీ, బీ డైరెక్టర్ జనరల్ గా ఏ .కే . ఖాన్
హైదరాబాద్,జనవరి5(జనంసాక్షి): తెలంగాణలో అవినీతి నిరోధక శాఖ డైరెక్టర్ జనరల్‌గా ఎ.కె. ఖాన్ నియమితులయ్యారు. అఖిల భారత సర్వీసు అధికారులకు పోస్టింగులు ఇచ్చే పక్రియ ప్రారంభించిన ప్రభుత్వం ఖాన్ నియామకంపై సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఖాన్ ఎసిబి డైరెక్టర్‌గా ఉన్నారు. సుదీర్ఘ అనుభవం ఉన్న ఖాన్ గతంలో నగర పోలీస్ కమిషనర్‌గా పని చేశారు.