తెలంగాణ కళాకారుల సమాఖ్య జిల్లా ఉపాధ్యక్షులుగా అమరవరపు సతీష్

గరిడేపల్లి, జూలై 19 (జనం సాక్షి): తెలంగాణ కళాకారుల సమాఖ్య సూర్యాపేట జిల్లా ఉపాధ్యక్షులుగా గరిడేపల్లి మండలం అప్పన్నపేట గ్రామానికి చెందిన డప్పు కళాకారుడు అమరవరపు సతీష్  నియమితులయ్యారు. తెలంగాణ కళాకారుల సమాఖ్య జిల్లా సమావేశంలో సూర్యాపేట జిల్లా అధ్యక్షులు బొర్రా శైలెందర్ నియామక పత్రం అందజేశారు. ఇట్టి కార్యకమంలో   జిల్లా ప్రధాన కార్యదర్శి చెరుకు శైలందర్ , రాష్ట్ర ఉపాధ్యక్షులు నకిరేకంటి కిరణ్ కుమార్, నల్గొండ జిల్లా అధ్యక్షులు రామా కమల్ హాసన్, యాతకుల యాదగిరి, కోశాధికారి ఉప్పల  నాగార్జున తదితరులు పాల్గొన్నారు.