తెలంగాణ కెనడా అసోసియేషన్ జాయింట్ కల్చరల్ సెక్రటరీగా డా. ప్రహళిక …

ఊరుకొండ, అక్టోబర్ 11 (జనంసాక్షి):
నాగర్ కర్నూలు జిల్లా ఊరుకొండ మండల కేంద్రానికి చెందిన మేకల జోష్ణ శ్రీనివాసులు దంపతుల పెద్ద కుమార్తె తెలంగాణ కెనడా అసోసియేషన్ జాయింట్ కల్చరల్ సెక్రటరీగా డాక్టర్ మ్యాకల ప్రహళిక నియమితులైనట్లు ఆమె తల్లిదండ్రులు తెలిపారు. ఈ సందర్భంగా మ్యాకల ప్రహళిక మాట్లాడుతూ.. నా తల్లిదండ్రులు పై చదువులకై నన్ను కెనడాకు పంపించారని.. తాను తెలుగువారితో పరిచయాలు పెంచుకొని మన తెలుగు వారు నిర్వహించే ప్రతి కార్యక్రమంలో పాల్గొంటున్నానని తెలిపారు. తనకు తోచిన సమాచారాన్ని తెలుగువారితో పంచుకుంటూ అన్ని కార్యక్రమాలలో పాల్గొని ఇక్కడ తెలుగువారితో కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటూ తనకు తోచిన సహాయాన్ని అందించడంలో ముందుంటున్నానని పేర్కొన్నారు. తాను అందరితో కలిసి మెలిసి ఉంటూ ప్రతి కార్యక్రమంలో చురుకుగా వ్యవరించడంతో తన ప్రతిభను గుర్తించి ఈ పదవి బాధ్యతలు అప్పగించినందుకు చాలా సంతోషంగా ఉందని ఆమె అభిప్రాయం తెలియజేశారు. తెలంగాణ కెనడా అసోసియేషన్ అధ్యక్షులు శ్రీ మన్నెం శ్రీనివాస్ కి మరియు తన తోటి సహచర మిత్రులకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా మ్యాకల శ్రీనివాసులు మాట్లాడుతూ.. ఆడపిల్ల అంటే ఎంతో భారంగా భావించే ఈ రోజులలో దేశం కానీ దేశంలో చదువుకుంటూ మన తెలుగువారు గర్వించేలాగా మరెన్నో పేరు ప్రతిష్టలు సంపాదించుకోవాలని.. పదిమందికి ఆదర్శప్రాయంగా నిలబడాలని దీవించారు. ఊరుకొండ మండల కేంద్రానికి చెందిన యువతి కుమారి డాక్టర్ ప్రహలిక తెలంగాణ కెనడా అసోసియేషన్ జాయింట్ కల్చరల్ సెక్రటరీగా నియమించబడడం అభినందనీయమని.. తమకు గర్వంగా ఉందని సర్పంచ్ కొమ్ము రాజు, ఎంపీపీ రాధ జంగయ్య, జడ్పిటిసి శాంతకుమారి రవీందర్, ముచ్చర్లపల్లి సర్పంచ్ వీరెడ్డి పర్వత్ రెడ్డి, మాజీ సర్పంచ్ లు ఎల్.నిరంజన్, జంగారెడ్డి, మ్యాకల శ్రీనివాసులు, ముచ్చర్ల జనార్దన్ రెడ్డి, ఊర్కొండ పేట సర్పంచ్ అనిత నాగోజి, మ్యాకల వెంకటనర్సయ్య, మ్యాకల చంద్రమౌళి, మ్యాకల యాదయ్య , సహదేవ్, ఖలీల్ , పాషా, చిత్తనూరి ప్రకాష్, రషీద్ , ప్రవీణ్ రెడ్డి, సాయి రెడ్డి, కృపయ్య, వరప్రసాద్,గుమ్మడి, సంగప్ప, రాచకొండ గోపి, దొంతు శ్రీను, పోలె భాస్కర్, గణేష్, చంద్రయ్య , మనోహర్ , సందీప్ 108 , కంఠం రాములు యాదయ్య , రవి, బోయ వెంకట్, రమేష్ , బోయకృష్ణ, రవి గౌడ్ , ఆలకుంట వెంకటేష్, శ్రీను, రఫీఖ్, ఫక్రుద్దీన్ తదితరులు ఆన్నారు. మండల స్థానిక ఆడబిడ్డకు లభించిన గొప్ప అవకాశంగా భావిస్తూ తాను పుట్టింటి పేరు, పుట్టిన ఊరు ప్రపంచం గుర్తించేలా మరెన్నో ఉన్నత పదవులు, కీర్తికిరీటాలను అందుకోవాలని స్థానికులు, సన్నిహితులు, ప్రజలు, తదితరులు అభినందనలు తెలిపారు.