తెలంగాణ కోసం..
హైదరాబాద్, డిసెంబర్ 30 (జనంసాక్షి) :
తెలంగాణ ప్రజల ఆకాంక్ష ప్రత్యేక రాష్ట్రం మాత్రమేనని టీ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ అన్నారు. ఆదివారం హైదరాబాద్‌లో నిర్వహించిన తెలంగాణ ఉద్యోగుల డైరీ ఆవిష్కరణలో ఆయన మాట్లాడారు. అందరు కలిసికట్టుగా ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమించాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్‌పై ఒత్తిడి తెచ్చి అఖిలపక్షం నిర్ణయంపై వెనక్కిపోకుండా ఒత్తిడి తేవాలని కోరారు. తెలంగాణ కోసం కలిసిరాని రాని రాజకీయ పార్టీలను బొందపెడుతామని హెచ్చరిం చారు. కేంద్రంపై అన్ని రాజకీయ పక్షాలు ఒత్తిడి కొనసాగించాలని కోరారు. తెలంగాణవారికి ఉద్యో గాల్లో అన్యాయం జరుగుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. డీఎస్సీ -2012 నియామ కాల్లో మహబూబ్‌నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల లోకల్ అభ్యర్థులకు అన్యాయం జరిగిందన్నారు. నాన్‌లోకల్ అభ్యర్థులను పోస్టుల్లో నియమిస్తున్నారని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు సక్రమంగా అమలుకావడం లేదన్నారు. తెలంగాణ ప్రజలకు ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు తప్ప వేరే ప్రత్యామ్నాయం లేదని టీఎన్‌జీవోస్ అధ్యక్షుడు దేవిప్రసాద్ అన్నారు. మండలి, ప్యాకేజీ అంటూ కేంద్రం కాలయాపన చేయాలని చూసినా, సమస్యను పక్కదారి పట్టించినా ఊరుకోబో మని హెచ్చరించారు. హైదరాబాద్‌తో కూడిన తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. నెల తర్వాత కేంద్రం మాట తప్పితే మళ్లీ సకల జనుల సమ్మెకు దిగుతామని హెచ్చరించారు. అఖిలపక్షం బూటకమని సీడబ్ల్యూసీ మాజీ సభ్యుడు కె. కేశవరావు అన్నారు. సభలో ఆయన ఆవేశంగా మాట్లాడారు. ప్రత్యేక రాష్ట్రం కోసం టీ కాంగ్రెస్ ఎంపీలు ఎంతగా ఒత్తిడి తెస్తున్నా, ఎన్ని ఉద్యమాలు చేస్తున్న అధిష్టానం స్పందించడం లేదన్నారు. నెల రోజుల్లో తెలంగాణ ఏర్పాటవుతుందన్న నమ్మకం తనకు లేదన్నారు. ఉద్యమం
ద్వారానే ప్రత్యేక రాష్ట్రం తెచ్చుకుందామని పిలుపునిచ్చారు. పెద్దపల్లి ఎంపీ వివేక్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం వస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు.