తెలంగాణ గాంధీకి ప్రభుత్వ లాంచనాలతో అంత్య్రక్రియలు
-భూపతి మృతి తీరని లోటు: కడియం
వరంగల్,ఫిబ్రవరి16(జనంసాక్షి): తెలంగాణ గాంధీ ప్రముఖ స్వతంత్య్ర సమరయోధులు భూపతి కృష్ణమూర్తి అంత్యక్రియలు వరంగల్‌లో అధికారిక లాంఛనాలతో పూర్తయ్యాయి. పోలీసులు గౌరవవందనంతో చితికి నిప్పంటించారు. తెలంగాణ శాసనసభాపతి మధుసూదనాచారి, ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఐకాస చైర్మన్ కోదండరాం తదితరులు అంత్యక్రియలకు హాజరయ్యారు. ఆయన సేవలను కొనియాడారు. ఆయనకు పలువురు ఘనంగా నివాళులు అర్పించారు. తెలంగాణ గాంధీ భూపతి కృష్ణమూర్తి మృతి తీరని లోటని తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి వరంగల్‌లో అన్నారు. ప్రభుత్వ లాంఛనాలతో కృష్ణమూర్తి అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు. మధ్యాహ్నం ఒంటి గంటకు కృష్ణమూర్తి అంతిమ యాత్ర ప్రారంభమవుతుందని…. తెలంగాణ ఉద్యమకారులు, అభిమానులు పాల్గొనాలని కోరారు. కృష్ణమూర్తి భౌతికకాయాన్ని వివిధ పార్టీల నేతలతో పాటు పలు పాఠశాలల విద్యార్థులు తెరాస ఎమ్యెల్యేలు, ఎంపీలు సందర్శించి నివాళులర్పించారు. జెఎసి నేత కోదండరామ్, ఉన్నతవిద్యామండలి ఛైర్మన్ పాపిరెడ్డి తదితరులు ఆయనకు నివాళులు అర్పించారు. జిల్లా టిఆర్‌ఎస్ నేతలు కూడా నివాళి అర్పించారు. కృష్ణమూర్తి అంత్యక్రియలు అధికారిక లాంఛనాలతో జరుగుతాయని కడియం తెలిపారు. కృష్ణమూర్తి భౌతికకాయానికి పలువురు నివాళులర్పించారు. ఆయన సేవలను గుర్తు చేసుకున్నారు.