తెలంగాణ గ్రామీణ బ్యాంక్ ఖాతాదారులకు అవగాహన సదస్సు
వేమనపల్లి,నవంబర్ 16,(జనంసాక్షి):
మండలంలోని గొర్లపల్లి గ్రామపంచాయతీలో తెలంగాణ గ్రామీణ బ్యాంక్ నీల్వాయి శాఖ ఆధ్వర్యంలో రిజర్వ్ బ్యాంక్ వారి ఆదేశాల మేరకు ఖాతాదారులకు జాతీయ సమగ్ర అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా బ్యాంక్ మేనేజర్ శివశంకర్ మాట్లాడుతూ తెలంగాణ గ్రామీణ బ్యాంక్ లావాదేవీలపై అవగాహన,వివిధ రకాల లోన్ లు,డిపాజిట్ పథకాలు, ప్రధాన మంత్రి జీవన జ్యోతి భీమా,సురక్ష యోజన,ఇతర ఇన్సూరెన్స్ పథకాలు,మొబైల్ బ్యాంకింగ్ వంటి సేవలపై అవగాహన కల్పించారు.బ్యాంక్ సేవలు, ఇన్సూరెన్స్,గోల్డ్ లోన్,డిజిటల్ సేవలు,క్రాఫ్ లోన్,గ్రామ ఐక్య సంఘాల రుణాల సద్వినియోగం చేసుకొని పొదుపు పథంలో పయనించే మార్గాలను వివరించారు. కుటీర చిన్న తరహా పరిశ్రమలకు రుణ సౌకర్యం కల్పించడంతోపాటు వివిధ పథకాలను ఖాతాదారులు వినియోగించుకోవాలని తెలిపారు.బ్యాంకుల పేరిట వివిధ బోగస్ వ్యాపార సంస్థల ఆగడాలను అరికట్టడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం నిర్వహించామని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఫీల్డ్ ఆఫీసర్ గంగాసాగర్,గ్రామస్తులు అరిగెల సంతోష్, రమేష్,రాజబాపు తదితరులు పాల్గొన్నారు.