తెలంగాణ చేనేత అరుదైన జాతి సంపద

4

-ప్రోత్సాహం, మార్కెటింగ్‌ అవకాశాలు కల్పిస్తాం

-సీఎం కేసీఆర్‌తో కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌

హైదరాబాద్‌, ఫిబ్రవరి14(జనంసాక్షి): తెలంగాణలోని అరుదైన , సంప్రదాయ చేనేత వస్త్రలని  కేంద్ర, వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ అన్నారు.  ఉత్పత్తులకు ప్రోత్సాహం, మార్కెటింగ్‌ అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌ కోరారు. మంత్రి నిర్మలా సీతారామన్‌ శనివారం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రిని కలుసుకున్నారు. ఈ సందర్భంగా తెలంగాణలోని చేనేత పరిశ్రమ, డ్రైపోర్టుత అభివృద్ది, మూసీ నదీ ప్రక్షాళన తదితర అంశాలు చర్చకు వచ్చాయి. మెహీదీపట్నం ప్రాంతానికి చెందిన బాలామణి దంపతులు డబుల్‌ ఇకత్‌ వీవింగ్‌ హ్యాండ్‌లూమ్‌ పరిఙ్ఞానంతో తయారు చేసిన చీరలు, లుంగీలను ముఖ్యమంత్రి , కేంద్రమంత్రికి చూపెట్టారు. వీటికి అంతర్జాతీయంగా డిమాండ్‌ ఉందని, అమెరికాలోని వైట్‌హౌజ్‌ అధికారులు కూడా వీటిని తెప్పించుకుంటారని నిర్మలాసీతారామన్‌ అన్నారు. తెలంగాణలో ఇలాంటి అరుదైన చేనేత కళాకారులు చాలా రకాల వస్త్ర ఉత్పత్తులను అందిస్తున్నారని వారికి ప్రభుత్వం అండగా ఉంటుందని ముఖ్యమంత్రి చెప్పారు. అయితే ఈ వస్తువులకు మార్కెటింగ్‌ సౌకర్యం కల్పించాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి అన్నారు. ఈ వస్త్ర ఉత్పత్తులను విదేశాలకు ఎగుమతి చేసే విషయంలో కేంద్ర సహాకారం కావాలని ముఖ్యమంత్రి అన్నారు. మారుతున్న అభిరులకు అనుగుణంగా వస్త్రాల తయారీకి అవసరమయ్యే శిక్షణ కూడా అందాల్సిన అవసరం ఉందని చెప్పారు. తెలంగాణలో చేనేత పరిశ్రమకు సహకారం అందిస్తామని కేంద్ర మంత్రి హావిూనిచ్చారు. కేంద్ర ప్రభుత్వం గంగా నదిని ప్రక్షాళన చేయాలని బృహత్తరం కార్యక్రమం తీసుకున్నదని, అదే తరహాలో ఆయా రాష్టాల్రోని కలుషితమైన నదుల విషయంలో కూడా కేంద్రం నిర్ణయం తీసుకోవాలని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. సబర్మతీ నదీ తీరంలాగానే మూసీ నదీ పరివాహక ప్రాంతాన్ని తీర్చిదిద్దాలనే ఆలోచన తమకు ఉందన్నారు. ఈ విషయాన్ని తాను ప్రధాని దృష్టికి కూడా తీసుకెళుతన్నన్నారు. సముద్రతీరం లేని రాష్టాల్రకు డ్రైపోర్టు అవసరం ఉందని, తెలంగాణలో కూడా డ్రైపోర్టు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి అన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఈటెల రాజేందర్‌, కే.టి. రామారావు, జోగు రామన్న, తుమ్మల నాగేశ్వరావు, ప్రభుత్వ సలహాదారుడు పాపారావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ, తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి వేణుగోపాలాచారి తదితరులు పాల్గొన్నారు.