తెలంగాణ ద్రోహులకు గుణపాఠం ఖాయం

ప్రజలు స్పష్టమైన తీర్పు ఇవ్వబోతున్నారు
నిజామాబాద్‌,డిసెంబరు7(జ‌నంసాక్షి): తెలంగానలో ఉద్యమించిన వారికి ఇప్పుడు చోటు లేకుండా పోయిందని డిసిసి మండిపడింది. కేవలం కెసిఆర్‌ తాబేదార్లకు మాత్రమే పదవులు కట్టబెడుతూ తెలంగాణ ఉద్యమకారులను విస్మరించారని డిసిసి అధ్యక్షుడు తాహిర్‌బిన్‌ హుదాన్‌ అన్నారు. ఈ ఎన్నికల్లో అసుల ఉద్యమకారులను ప్రజలు ఆదరించబోతున్నారని అన్నారు. తెలంగాణ ద్రోహుకలు బుద్ది చెప్పబోతున్నారని అన్నారు. వారిని కాంగ్రెస్‌ ఏజెంట్లుగా అభివర్ణించి తక్కువ చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలోని రైతు సమస్యలు, నకిలీ విత్తనాలు, రుణమాఫీతోపాటు ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై  కాంగ్రెస్‌  పోరాటం చేస్తున్నదని అన్నారు. అందువల్లే తమ నేతలతో విమర్శలు చేయిస్తున్నారని అన్నారు.  నాటి ఉద్యమకారులు తమ జీవితాలను పణంగా పెడుతుంటే ఉద్యమ ద్రోహులెమో ప్రభుత్వంలో మంత్రులుగా మారుతున్నారన్నారు. వీరందరికి ఈ ఎన్నికల్లో గుణపాఠం తప్పదని అన్నారు. ఉద్యమ ద్రోహులను ప్రజలు గుర్తించి గట్టిగా బుద్ది చెప్పబోతున్నారని అన్నారు.  ప్రభుత్వం చేపడుతున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రశ్నిస్తున్న  కోదండరామ్‌, తదితరులపై కొందరు చోట మోట నేతలతో విమర్శల దాడులు చేయించడం కేసీఆర్‌, కేటీఆర్‌ దురాహంకారానికి నిదర్శనమన్నారు.  ప్రజా సమస్యలపై పోరాడితే ఇక తెలంగాణ ద్రోహులు అంటూ కించపరచడం వారి పెత్తందారి వ్యవస్థకు నిదర్శనమన్నారు. రాష్ట్ర సాధనే లక్ష్యంగా ఐకాస కన్వీనర్‌గా పోరాటాలు చేసిన కోదండరాం ఇప్పుడు కూటమిలో చేరడంతో  తెలంగాణ వాదులెవరో ప్రజలు నిర్ణయించబోతున్నారని అన్నారు. ప్రజలు అన్నీ గమనించి కూటమికి పట్టం కట్టబోతున్నారు. టిఆర్‌ఎస్‌కు గుణపాఠం తప్పదని అన్నారు.