తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములవుదాం
టీజేఏసీ చైర్మన్ కోదండరామ్
రంగారెడ్డి, ఫిబ్రవరి8(జనంసాక్షి): తెలంగాణ ఉద్యమంలో కలిసి పనిచేసినం. రేపటి తెలంగాణ పునర్ నిర్మాణంలో కూడా కలిసి పనిచేద్దామని జేఏసీ ఛైర్మన్, ప్రొ. కోదండరాం ఉద్యోగులకు పిలుపునిచ్చారు. రంగారెడ్డి జెడ్పీ కార్యాలయంలో తెలంగాణ జేఏసీ ఆధ్వర్యంలో జరిగిన మిషన్ కాకతీయ సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రొ. కోదండరాం మాట్లాడుతూ… నా జీవత కాలంలో మిషన్ కాకతీయలాంటి కార్యక్రమాన్ని చూస్తాననుకోలేదు. మిషన్ కాకతీయ పూర్తయితే రెండుమూడేళ్లలో తెలంగాణ ముఖచిత్రం మారుతుంది. ప్రభుత్వం ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయం. జేఏసీ ఆధ్వర్యంలో మిషన్ కాకతీయపై అన్ని జిల్లాల్లో అవగాహన సదస్సులు, సెమినార్‌లు నిర్వహిస్తం. ప్రజల్లో చైతన్యం తీసుకువస్తం. ఉద్యోగులంతా ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలి. ఉద్యోగులు అభివృద్ధిలో పాలుపంచుకోవాలని ఆయన పేర్కొన్నారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు వీలైనంత త్వరగా ఏపీ నుంచి పాలన సాగించాలని సూచించారు. ఉద్యోగ