తెలంగాణ ప్రజల అభీష్టం మేరకే విభజన – సీఎం వ్యాఖ్యలు పుండు మీద
కారం చల్లినట్టున్నయ్ : జానా రెడ్డి
అక్టోబర్ 10 (జనంసాక్షి): రాజకీయాల కోసం రాష్టాన్న్రి విభజించలేమన్న ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి వ్యాఖ్యలను పంచాయతీరాజ్ శాఖ మంత్రి కె.జానారెడ్డి ఖండించారు. రాజకీయం కోసం విభజన అనడం సరికాదని, సీఎం అలా మాట్లాడి ఉండాల్సి కాదని అన్నారు. తెలంగాణ ప్రజల అభీష్టం మేరకే తాము రాష్ట్ర విభజన కోరుతున్నామని చెప్పారు.
రాజకీయాల కోసం కాకపోయినా… తెలంగాణ ప్రజల వారి ఆకాంక్ష మేరకు రాష్టాన్న్రి విభజించాల్సిందేనని స్పష్టం చేశారు. బుధవారం వరంగల్ జిల్లాకు వచ్చిన మంత్రి జానారెడ్డి విూడియాతో మాట్లాడుతూ.. సీఎం వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబట్టారు. తెలంగాణ విషయంలో ఆయన నిస్సహాయుడని మండిపడ్డారు. రాష్ట్ర విభజన ఆయన చేతుల్లో లేదన్నారు. రాజకీయాల కోసం కాకున్నా.. తెలంగాణ ప్రజల కోరిక మేరకు రాష్ట్ర విభజన జరుగుతుందని విశ్వాసం వ్యక్తంచేశారు. రాష్టాన్న్రి విడగొట్టకపోతే.. విరగ్గొట్టు కోవాల్సి వస్తుందని ముఖ్యమంత్రిని హెచ్చరించారు. తెలంగాణలోని 119 నియోజకవర్గాల్లో గెలుపునకు హావిూ ఇస్తే.. తెలంగాణ ఇచ్చేందుకు కాంగ్రెస్ అధిష్టానం సిద్దమేనని జానా పేర్కొన్నారు. ప్రజల అభీష్టం మేరకే హైకమాండ్ త్వరలో నిర్ణయం వెలువరిస్తుందని చెప్పారు. త్వరలోనే ఢిల్లీ వెళ్లి పార్టీ పెద్దలను, కేంద్ర మంత్రులను కలిసి తెలంగాణ రాష్ట్ర ప్రకటనను సత్వరమే చేయాల్సిన అవసరాన్ని వారి దృష్టికి తీసుకువస్తామన్నారు. తెలంగాణ ఉద్యమం ప్రజాభీష్టం మేరకు జరుగుతోందన్నారు. పాలమూరు జిల్లాల ఢిల్లీ టూరును జానా పరోక్షంగా ఎద్దేవా చేశారు. తెలంగాణ ప్రాంత ప్రజల ఒత్తిడి తట్టుకోలేకే ఢిల్లీ వెళ్లి టైంపాస్ చేస్తున్నారని విమర్శించారు. విూడియా, తెలంగాణ వాదుల ఒత్తిడితోనే ఢిల్లీ పర్యటనలు చేపట్టినట్లు తెలిపారు.