తెలంగాణ ప్రభుత్వం మత్స్యకారుల అభివృద్ధికి ఉచిత చేప పిల్లలను అందిస్తుంది.
చౌటపల్లి గ్రామ సర్పంచ్ గద్దల రమేష్
హుస్నాబాద్ రూరల్ అక్టోబర్ 22(జనంసాక్షి) తెలంగాణ ప్రభుత్వం మత్స్యకారుల అభివృద్ధికి ఉచిత చేప పిల్లలను అందిస్తుందనీ చౌటపల్లి గ్రామ సర్పంచ్ గద్దల రమేష్ అన్నారు. గ్రామంలో కొత్త చెరువులో చౌటపల్లి గ్రామ మత్స్యసంఘం ఆధ్వర్యంలో తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న 41వేల ఉచిత చేప పిల్లలను శనివారం గ్రామ సర్పంచ్ గద్దల రమేష్ వదిలారు.మత్స్యకారులను గత ప్రభుత్వాలు విస్మరించిన తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తరువాత గ్రామ సంఘాలు ఆర్థికంగా నిలబడేందుకు సహకారం అందిస్తుంది కేసీఆర్ ప్రభుత్వం అని అన్నారు.హరితహారంలో నాటిన చెట్లవలన అధిక వర్షపాతం నమోదవ్వడంతో మిషన్ కాకతీయ ప్రోగ్రామంలో చెరువును లోతు పెంచడం వంటి కార్యక్రమాలతో చేపలను పెంచడం కోసం అనువుగా మారడం సంతోషకరమని,ఉచిత చేపపిల్లను అందించిన సీఎం కేసీఆర్ కి జిల్లా మంత్రి తన్నీరు హరీష్ రావు కి హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితల సతిష్ కుమార్ కి చౌటపల్లి గ్రామ మత్స్యకారుల సంఘం తరుపున సర్పంచ్ రమేష్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో కేశవాపూర్ ఎంపీటీసీ గంగాదరి సుగుణ,సంఘం అధ్యక్షకార్యదర్శి గంటల ఐలయ్య, గౌరవేని కుమారస్వామి వార్డు సభ్యులు గంగాదరి శ్రీనివాస్,ఆరెస్సెస్ సభ్యులు గంగాదరి రాజయ్య,సభ్యులు గంటల రాజయ్య,గంగాదరి రాజయ్య,గంటల రాజయ్య,తిగుళ్ల భిక్షపతి,గంగాదరి శ్రీనివాస్,పులికాశి సంపత్,గూళ్ల సురేందర్,గంటల రాజయ్య,పులికాశి శంకర్,పులికాశి రమేష్,గౌరవేని కొమురయ్య తదితరులు పాల్గొన్నారు.