తెలంగాణ ప్రాజెక్టుల జోలికివస్తే జాగ్రత్త

5

– మహబూబాబాద్‌ పునావృతం అవుతుంది

– జగన్‌కు హరీశ్‌ రావు హెచ్చరిక

ఆదిలాబాద్‌,మే16(జనంసాక్షి):వైసీపీ అధినేత జగన్‌ తీవ్రస్థాయిలో మండిపడ్డారు మంత్రి హరీశ్‌ రావు. తెలంగాణ ప్రాజెక్టులకు వ్యతిరేకంగా జగన్‌ దీక్ష చేయడం హాస్యాస్పదం అన్నారు. స్వార్థ రాజకీయాలకోసం తెలంగాణ ప్రాజెక్టులను అడ్డుకుంటే మరోసారి మానుకోట ఘటన పునరావృతమైతదని హెచ్చరించారు. ప్రాజెక్టులను అడ్డుకుని తెలంగాణ ప్రాంత రైతులు ఉసురు పోసుకోవద్దని విజ్ఞప్తి చేశారు. చంద్రబాబు, జగన్‌ స్వార్థ రాజకీయాల కోసం తెలంగాణ ప్రాజెక్టులను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాలమూరు జిల్లాకు ఒక టీఎంసీ నీటి విడుదలకు అంగీకరించిన కర్నాటక సీఎం, ఇరిగేషన్‌ మంత్రికి పాలమూరు జిల్లా ప్రజల తరపున హరీశ్‌ కృతజ్ఞతలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, వైకాపా అధ్యక్షుడు జగన్‌ తమ స్వార్థ రాజకీయాల కోసం తెలంగాణలోని ప్రాజెక్టులను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని భారీ నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు దుయ్యబట్టారు. మహారాష్ట్ర-తెలంగాణ సరిహద్దులో గల పెన్‌గంగా నదిపై నిర్మిస్తున్న ప్రాజెక్టు వద్ద ఆదివారం రాత్రి ఆయన బస చేసి… ఈరోజు ఉదయం ప్రాజెక్టు పనులను పరిశీలించారు.ఈ సందర్భంగా విూడియాతో మాట్లాడుతూ… చంద్రబాబు సుప్రీంకోర్టులో కేసు వేసి, జగన్‌ దీక్షలు చేపట్టి తెలంగాణ ప్రాజెక్టుల నిర్మాణాలకు అడ్డుతగిలే ప్రయత్నం చేస్తే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు. బ్రిజేష్‌కుమార్‌ ట్రైబ్యునల్‌ తీర్పునకు లోబడే తాము ప్రాజెక్టులు నిర్మించుకుంటున్నామన్నారు. గోదావరి, కృష్ణా నదుల నుంచి ఒక్క నీటి చుక్కను కూడా ఎక్కువగా వాడుకోమని స్పష్టం చేశారు. ప్రాణహిత-చేవెళ్ల విషయంలోనూ కాంగ్రెస్‌ అనవసర రాద్ధాంతం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.

చంద్రబాబు,జగన్‌ కుట్రలను అడ్డుకుంటాం

ప్రాజెక్టులను అడ్డుకొని తెలంగాణ రైతుల ఉసురుపోసుకోవద్దన్నారు. చంద్రబాబు, జగన్‌ స్వార్థ రాజకీయాల కోసం తెలంగాణ ప్రాజెక్టులను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. మహారాష్ట్ర, కర్ణాటక రాష్టాల్రు ప్రాజెక్టుల విషయంలో తెలంగాణ ప్రభుత్వంతో మాట్లాడి సమస్యలు పరిష్కరించుకుంటుంటే ఏపీ మాత్రం సమస్యలను జఠిలం చేస్తున్నదిదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదిలాబాద్‌ జిల్లా పర్యటనలో ఉన్న మంత్రి విూడియాతో మాట్లాడుతూ.. స్వార్థ రాజకీయాల కోసం తెలంగాణ ప్రాజెక్టులను అడ్డుకుంటే మరోసారి మానుకోట ఘటన పునరావృతమైతదని జగన్‌ను హెచ్చరించారు. గతంలో విూ తండ్రి రాయలసీమకు నీళ్లు మళ్లించి తెలంగాణకు అన్యాయం చేసిన మాట వాస్తవం కాదా అని ప్రశ్నించారు. సాగునీటి ప్రాజెక్టులపై మాట్లాడుకునేందుకు స్వయంగా పిలిచినా ఏపీ ఇరిగేషన్‌ మంత్రి దేవినేని ఉమ స్పందించలేదని తెలిపారు. చంద్రబాబు, జగన్‌లు తెలంగాణ ప్రాజెక్ట్‌లను అడ్డుకునేందుకు యత్నిస్తున్నారని మంత్రి హరీష్‌రావు ఆరోపించారు. తమ నీటి వాటానే వాడుకుంటున్నామని మంత్రి  చెప్పారు. జగన్‌ దీక్షలతో తెలంగాణలో ప్రాజెక్ట్‌లను ఆపలేరని, ఏపీ రైతులకు అన్యాయం చేసే ఉద్దేశం తమకు లేదని మంత్రి స్పష్టం చేశారు.కాంగ్రెస్‌ నేతలు అధికారంలో ఉన్నప్పుడు

ఏం చేశారని,  ఇప్పుడు అడ్డగోలుగా మాట్లాడుతున్నారని ఆయన విమర్శించారు. ఎవరెన్ని కుట్రలు చేసినా ప్రాజెక్ట్‌ల నిర్మాణం ఆగదని హరీష్‌రావు స్పష్టం చేశారు. మహబూబ్‌నగర్‌ జిల్లాకు ఒక టీఎంసీ నీటి విడుదలకు అంగీకరించిన కర్ణాటక సీఎం, ఇరిగేషన్‌ మంత్రికి పాలమూరు ప్రజల తరపున కృతజ్ఞతలు తెలిపారు. ఆదిలాబాద్‌ జిల్లాను సస్యశ్యామలం చేసేందుకు సీఎం కేసీఆర్‌ కట్టుబడి ఉన్నారని స్పష్టం చేశారు. కొరటా – చనకా బ్యారేజీతో 51 వేల ఎకరాలకు సాగునీరందిస్తామని చెప్పారు. రాష్టాన్న్రి సుదీర్ఘంగా పాలించిన కాంగ్రెస్‌ ప్రభుత్వ పాపాలను అభివృద్ది పనులు చేపట్టడం ద్వారా ప్రక్షాళన చేస్తున్నామని హరీష్‌రావు పేర్కొన్నారు.  జలాశయాలు పూర్తయితే పార్టీ మనుగడ కష్టమవుతుందని భావిస్తున్న కాంగ్రెస్‌ నాయకులు జలాశయాలను అడ్డుకోవాలని చూస్తున్నారని ఇందులో భాగంగానే నిరాధార ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. తెలంగాణలో అసలు ప్రాజెక్ట్‌లు పూర్తికావని కాంగ్రెస్‌పార్టీ ప్రచారం చేస్తుందని, మరోవైపు పాలమూరు ఎత్తిపోతల పథకాలను అడ్డుకునేందుకు ఆంధ్రా పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి శ్రీశైలం వద్ద నిరాహదీక్షలు చేపడుతున్నారని, పరస్పర విరుద్ద ఆందోళనలు, ప్రకటనలతో కాంగ్రెస్‌పార్టీ గందరగోళంగా మారిందని పేర్కొన్నారు.  వచ్చే రెండేళ్లలో జలాశయాలను పూర్తిచేసి తెలంగాణను సస్యశ్యామలం చేస్తామని పేర్కొన్నారు. జిల్లాలో సైతం పెండింగ్‌ జలాశయాలను 2018లోగా పూర్తిచేసి జిల్లాను సస్యశ్యామలం చేస్తామని పేర్కొన్నారు. ముథోల్‌ నియోజకవర్గంలో గడ్డెన్నవాగు ప్రాజెక్ట్‌ గరిష్ట నీటి నిల్వకు అడ్డంకిగా మారిన పునరావాస గ్రామమైన సాంవ్లీకి 23 కోట్ల పరిహరం కేటాయించామని, ఈ సంవత్సరం నుంచి గరిష్టస్థాయి నీటిమట్టం నిల్వచేసి ఆయకట్టుకు నీరందిస్తామని తెలిపారు. కాల్వల నిర్మాణానికి పీఎంకేఎస్‌వై పథకం ద్వారా నిధుల కేటాయింపునకు ప్రయత్నిస్తున్నామనని తెలిపారు. నియోజకవర్గంలో అయిదు ఎత్తిపోతల పథకాల మరమ్మత్తులకు 12 కోట్లు కేటాయించామని, తర్వాతి దశలో మిగతా పథకాలకు నిధులందిస్తామన్నారు. చిన్న సుద్దవాగు, బాసర చెక్‌డ్యాం, ప్రాణహిత-చేవేళ్ల ప్యాకేజీ-28 ద్వారా నియోజకవర్గంలో 60,000 ఎకరాలకు నీరందిస్తామని పేర్కొన్నారు.