తెలంగాణ మంత్రులు రాజీనామా చేయాలి : ఏబీవీపీ
పరకాల : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో జరుగుతున్న అలస్యాన్ని వ్యతిరేకిస్తూ తెలంగాణ మంత్రులు తమ పదవులను రాజీనామా చేయాలని ఏబీవీపీ నాయకులు డిమాండ్ చేశారు.అంబేద్కర్ విగ్రహం నుంచి నగర పంచాయితి కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి, ప్రధాన రోడ్డుపై ధర్నా చేపట్టారు. తెలంగాణకోసం ప్రాణ త్యాగం చేసిన ఓయూ విద్యార్థి సంతోష్‌కు నివాళులు అర్పించారు. కార్యక్రమంలో నాయకులు శివరాం, నరేశ్ తదితరులు పాల్గోన్నారు.