తెలంగాణ రాష్ట్రంలో అన్ని వర్గాలకు ప్రభుత్వ చేయూత

అన్ని రకాలుగా దివ్యాంగులకు ప్రభుత్వ సహకారం

రూ.4016 ఆసరా ఫించను ఇస్తున్న ఏకైక రాష్ట్రం

తెలంగాణ

చదువుకుంటున్న విద్యార్థులకు రూ.500 రవాణా భత్యం

వనపర్తి  జనం సాక్షి

వనపర్తి మంత్రి క్యాంపు కార్యాలయంలో వనపర్తి జిల్లాలోని దివ్యాంగులైన పిల్లలు 128 మందికి వీల్ చైర్స్ , హియరింగ్ ఎయిడ్స్ తదితర ఉచిత ఉపకరణాల పంపిణీ, 270 మంది మైనారిటీ మహిళలకు కుట్టుమిషన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. జీవితంలో వెలుగులు నింపే లక్ష్యంతో దివ్యాంగ విద్యార్థులకు చేయూతనిస్తున్నారు. డిగ్రీ ఆపైన ఉన్నత విద్యను అభ్యసిస్తున్న దివ్యాంగుల్లో కాళ్లు లేకుండా చేతులు బాగా ఉన్న విద్యార్థులకు మోటరైజ్డ్‌ వెహికిల్స్‌ అందిస్తున్నారు. గతంలో 50 శాతం సబ్సిడీపై అందించినా.. ఇప్పుడు పూర్తి సబ్సిడీపై ఇస్తున్నారు. ఇవే కాకుండా కళ్లు లేని డిగ్రీ ఆపైన విద్యను అభ్యసిస్తున్న వారికి 25 వేల విలువైన ల్యాప్‌ట్యాప్‌ను ఉచితంగా అందిస్తున్నారు. మూగ విద్యార్థులకు 4జీ స్మార్ట్‌ ఫోన్లు అందజేస్తున్నారు. అంధులైన విద్యార్థుల కోసం పాఠాలు రికార్డు చేసుకునే విధంగా డీజే ప్లేయర్స్‌ ఇస్తున్నారు. ఇక 9వ, 10వ తరగతులు చదువుతున్న అంధ పిల్లలకు ఎంపీ 3 ప్లేయర్లు, కండరాల క్షీణతతో బాధపడుతున్న దివ్యాంగులకు బ్యాటరీ వీల్‌ చైర్స్‌ పంపిణీ చేస్తున్నారు. అవసరమైన విద్యార్థులకు వారానికి ఒకసారి ఫిజిథెరపీ అందిస్తున్నారు. ప్రతి సబ్జెక్టుకు 20 మార్కులు వస్తే దివ్యాంగులు ఉత్తీర్ణత .. మానసిక దివ్యాంగులకు 10 మార్కులు వస్తే ఉత్తీర్ణత చేస్తున్నారు . ప్రభుత్వం నుండి ప్రత్యేకంగా ఉపాధ్యాయులను నియమించి దివ్యాంగులకు విద్యా బోధన అందిస్తున్నారు. దివ్యాంగుల కోసం పనిచేస్తున్న ఉపాధ్యాయులకు కృతజ్ఞతలు తెలియచేసారు. దివ్యాంగులైన పిల్లలకు కాలక్రమంలో మంచిగ అవుతుందన్నా ఆశాభావంతో పనిచేయాలని కోరారు. ప్రభుత్వం నుండి వచ్చిన ఉపకరణాలు సద్వినియోగం చేసుకోవాలన్నారు . ఆడబిడ్డలు వారి కాళ్ల మీద వారు నిలబడాలన్నారు . కుట్టుమిషన్లతో జీవనోపాధి పొందాలి అని మంత్రి తెలిపారు .

అనేకమంది మహిళలు ఈ రంగంలో అద్భుతాలు సృష్టిస్తున్నారు. ప్రభుత్వపరంగా అన్ని రకాలుగా చేయూత అందిస్తునది అలాగే సమాజంలోని అన్ని వర్గాల అభ్యున్నతే ప్రభుత్వ లక్ష్యం అని మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తెలిపారు.

తాజావార్తలు