తెలంగాణ రైతాంగంపై సర్కార్ వివక్ష: టీఆర్‌ఎస్
వరంగల్: తెలంగాణ రైతాంగంపై సీఎం కిరణ్ సర్కార్ వివక్ష చూపుతోందని టీఆర్‌ఎస్ ఆరోపించింది, వరంగల్ జిల్లా తుపాను బాధితులను టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పర్యామర్శించారు. నీట మునిగి నష్టపోయిన పంటలను ఎమ్మెల్యేలు పరిశీలించారు. వర్షాల వల్ల దెబ్బతిన్న పంటలకు ఎకరాంకు రూ.30 వేల నష్టపరిహారం చెల్లించాలని టీఆర్‌ఎస్ డిమాండ్ చేసింది. రైతులకు రుణాలు మాఫీ చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. జిల్లాకు మంజూరైన రూ.12 కోట్ల ఇన్‌పుట్ సబ్సిడీని రైతులకు చెల్లించాలని కోరింది.