తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలను జయప్రదం చేయండి
సిపిఐ
వనపర్తి:సెప్టెంబర్ 13 (జనం సాక్షి)సిపిఐ రాష్ట్ర పార్టీ పిలుపుమేరకు సెప్టెంబర్ నెల 17వ తేదీ వరకు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలను నిర్వహిస్తున్నట్లు సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు పి కళావతమ్మ శ్రీరామ్ పానగల్ మండల కార్యదర్శి డంగు కుర్మయ్య వనపర్తి పట్టణ కార్యదర్శి రమేష్ ఒక సంయుక్త ప్రకటనలో తెలిపారు. కమ్యూనిస్టు నాయకులు సానుభూతిపరులు ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు సెప్టెంబర్ 17,1948 కి చరిత్రలో ఎంతో ప్రాముఖ్యత ఉందని పేర్కొన్నారు ఆరోజు నిజాం పాలనలోని హైదరాబాద్ స్టేట్( తెలంగాణ) భారత దేశంలో విలీనమైన రోజని తెలిపారు. భారత దేశానికి ఆగస్టు 15,1947లో స్వాతంత్రం వచ్చిందని హైదరాబాద్ స్టేట్ మాత్రం నిజాం పాలనలోనే ఉండిపోయిందని తెలిపారు. తెలంగాణ విముక్తి కోసం సిపిఐ ఆధ్వర్యంలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం సాగిందని తెలిపారు కమ్యూనిస్టుల ఆధ్వర్యంలో జరిగిన పోరాటంలో నిజాం నుంచి విముక్తి 3000 గ్రామాలను విముక్తం చేసి ఎర్రజెండాలను పాతారని తెలిపారు.10 లక్షల ఎకరాల భూమిని పేదలకు పంచారని తెలిపారు ఈ పోరాటంలో 4500 మంది సిపిఐ కార్యకర్తలు బలిదానం చేశారని తెలిపారు.అందులో దొడ్డి కొమరయ్య తొలి వీర అమరుడని వెల్లడించారు జర్నలిస్ట్ సోయబుల్లా ఖాన్ నిజాంకు వ్యతిరేకంగా వార్తల రాసినందుకు చంపివేశారని తెలిపారు సిపిఐ నాయకులు రావి నారాయణరెడ్డి,మగ్దుం మోహిను ద్దీన్,బద్దం ఎల్లారెడ్డి, భీమ్ రెడ్డి తదితరుల నాయకత్వంలో గెరిల్లా పోరు సాగిందని తెలిపారు. చాకలి ఐలమ్మ మల్లు స్వరాజ్యం వంటి మహిళలు తుపాకి పరిచారన్నారు.గ్రామాల్లో ప్రజలపై అరాచకాలు చేస్తున్న దొరలు,దేశ్ముకులు,జాగీర్దార్లు జమీందారులను సిపిఐ తరిమికొట్టడంతో గ్రామాలను విడిచి హైదరాబాద్ పారిపోయి నిజాం నవాబును శరణు జొచ్చారని తెలిపారు తెలంగాణ నిజాం నుండి విముక్తమై దాదాపు కమ్యూనిస్టుల చేతుల్లోకి వచ్చిందని తెలిపారు ఈ దశలో సర్దార్ వల్లభాయ్ పటేల్ సైనిక చర్య చేపట్టారని తెలిపారు కాంగ్రెస్ నాయకుల పేరుతో జమీందారులు జాగిర్దారులు దేశ్ముకులు తిరిగి గ్రామాల్లోకి వచ్చి తిష్ట వేశారని తెలిపారు కమ్యూనిస్టుల తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం వల్లనే తెలంగాణకు విముక్తి లభించి భారతదేశంలో విలీనం అయిందని తెలిపారు అందువల్ల సిపిఐ సెప్టెంబర్ 17న విలీన దినోత్సవం జరుపుకుంటున్నమని తెలిపారు గ్రామాల్లో ఎర్రజెండాలు ఎగిరేసి సెప్టెంబర్ 17న జాతీయ పతాకం ఎగరవేసి,ఈ ఉత్సవాలను వారం రోజులపాటు నిర్వహిస్తామని తెలిపారు ఇందులో భాగంగా పానగల్ మండలం కేతేపల్లిలో సెప్టెంబర్ 14న తెల్లరాళ్లపల్లిలో సెప్టెంబర్ 15న వెంగలాయపల్లిలో సెప్టెంబర్ 16న వీప
వీపనగండ్ల మండలం బొల్లారంలో 17న,అదే రోజు వనపర్తి జిల్లా కేంద్రంలో కూడా ఉత్సవాలు జరుగుతాయని ప్రజలు కమ్యూనిస్టులు వారి సానుభూతిపరులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.
ReplyForward
|