తెలంగాణ వచ్చే వరకూ నిద్ర పోను: నాగం

రంగారెడ్డి: తెలంగాణ వచ్చే వరకు తాను నిద్రపోనని…  ఎవ్వర్ని నిద్రపోనివ్వనని నాగం జనార్థన్‌రెడ్డి అన్నారు. రంగారెడ్డి జిల్లా గండేడే మండలం నుంచి ఆయన ‘ తెలంగాణ భరోసా’ యాత్రను మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు ఆత్మబలిదానాలు చేసుకోవద్దని విజ్ఞప్తి చేశారు.