తెలంగాణ విముక్తి పోరాట చరిత్ర కమ్యూనిస్టులదే
భారత జాతీయ మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షులు పి కళావతమ్మ
వనపర్తి టౌన్ సెప్టెంబర్ 17(జనం సాక్షి)తెలంగాణ విముక్తి పోరాడు చరిత్ర కమ్యూనిస్టుల దేనని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు భారత జాతీయ మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షులు పి.కళావతమ్మ,ప్రజానాట్యమండలి జిల్లా అధ్యక్షులు వంకా గోపాల్ అన్నారు.శనివారం బొల్లారం గ్రామంలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలను ఘనంగా నిర్వహించారు అంతకుముందు గ్రామంలో ప్రదర్శన చేశారు అనంతరం బస్టాండ్ వద్ద సాయుధ పోరాట అమరవీరుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు అరుణ పతాకాన్ని బొల్లారం పార్టీ గ్రామ శాఖ కార్యదర్శి చల్మారెడ్డి ఆవిష్కరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భూమికోసం భుక్తి కోసం దొరల నైజాం బానిసత్వం నుంచి విముక్తి కోసం తెలంగాణ సాయుధ సమరం జరిగిందన్నారు నిజాం తాబేదార్లు దొరలు జాగీరు దారులను జమీందారులు దేశముకులను ప్రజా చైతన్యంతో తరిమికొట్టారన్నారు ఈ పోరాటంలో 4500 మంది అమరులయ్యారన్నారు మూడువేల గ్రామాలను విముక్తం చేసి ఎర్రజెండాలు పాతారన్నారు 10 లక్షలు ఎకరాలు భూమి పేదలకు పంచారన్నారు భారతదేశ చరిత్రలో గతమెన్నడు ఇంతటి మహత్తర పోరాటం జరగలేదన్నారు ఈ పోరాటంపై హక్కు కమ్యూనిస్టులదే అన్నారు బిజెపి దాన్ని వక్రీకరించి ప్రయత్నం చేస్తుందన్నారు కమ్యూనిస్టుల ఈ గెరిల్లా పోరాటంతో నిజాం దిగిరాక తప్పలేదు అన్నారు దాంతో తెలంగాణ విముక్తమై భారత దేశంలో విలీనం అయిందన్నారు స్వాతంత్రం లభించక కూడా అనేక కష్టాలు రైతు కూలీలు వివిధ వర్గాల ప్రజలు ఎదుర్కొంటున్నారన్నారు ప్రజలలో చైతన్యం నింపి సంఘటితం చేసి ఎర్రజెండా నాయకత్వంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడానన్నారు పోరాటంతోనే సమస్యల పరిష్కారం సాధ్యమన్నారు ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ కార్యదర్శి చలమారెడ్డి తెల్ల రాళ్లపల్లి ఉప సర్పంచ్ బాలస్వామి ఆ గ్రామ పార్టీ కార్యదర్శి సహదేవ్ పానగల్ మండల కార్యదర్శి డంగు కుర్మయ్య సీనియర్ నాయకులు మండ్ల కృష్ణయ్య హనుమంతు చిన్న కుర్మయ్య ఎర్రగుంట రాములు కాకం రాముడు హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు
Attachments area