తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం కరీంనగర్ జిల్లా మహాసభ లు జయప్రదం చేయాలి…
ఈనెల 27 28 తేదీలలో జరిగేతెలంగాణవ్యవసాయ కార్మిక సంఘం జిల్లా మహాసభలుజయప్రదం చేయాలని జిల్లా ప్రధాన కార్యదర్శి వడ్ల రాజు కోరారు. శుక్ర వారం వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటి ఆధ్వర్యంలో ముకుందలాలు మిశ్రా భవన్ లో కరపత్రం విడుదల చేయడం జరిగింది.
ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి వడ్ల రాజు మాట్లాడుతు… కేంద్రంలో బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత ఉపాధి హామీ పథకాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసి, ఉపాధి హామీ కూలీల కడుపు కొడుతున్నారు అని అన్నారు. పెరిగిన ధరలకు అనుగుణంగా రోజు కూలీ 600లకు పెంచాలని,200పనిదినాలు కల్పించాలని అన్నారు.పని ప్రదేశాలలో కూలీలకు సౌకర్యాలు లేవన్నారు. కొలతలకు సంబంధం లేకుండా కూలీ ఇవ్వాలన్నారు.ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు జిల్లా అధ్యక్షులు రాయి కంటి శ్రీనివాస్ సహాయ కార్యదర్శి కవ్వంపల్లి అజయ్ తిరుపతి రామయ్యతదితరులు పాల్గొన్నారు.